Aamir khan dhoom 3 sets new record

Aamir khan Dhoom-3, new recods, Dhoom-3 breaks Krrish 3, record

Aamir Khan Dhoom 3 sets new record.

ధూమ్ - 3 కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందా

Posted: 12/19/2013 10:45 PM IST
Aamir khan dhoom 3 sets new record

సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ సినిమా 100 కోట్లు దాటితేనే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ గత కొన్ని రోజుల నుండి వందకోట్లు దాటి రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లకు చేరింది. ఇటీవల వచ్చిన క్రిష్ సినిమా 300 కోట్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ నటించిన ‘ధూమ్ 3’ సినిమా కూడా చాలా విషయాల్లో ఇలాగే విడుదలకు ముందే రికార్డులు కొడుతోంది. ఆన్ లైన్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగులో ఈ సినిమా సరికొత్త రికార్డును కొట్టింది.

ఇంతవరకు సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్తా టైగర్ ’ సినిమా పేరిట ఈ విషయంలో రికార్డు వుంది. ఇప్పుడు ‘ధూమ్ 3’ దానిని అధిగమించింది. అలాగే, విదేశాలలో 700 ధియేటర్లలో రిలీజవుతూ మరో రికార్డు ఖాతాలో వేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలవుతున్న ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని బాలీవుడ్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles