Naga chaitanya autonagar surya theatrical trailer launch

Naga Chaitanya Autonagar Surya theatrical trailer launch, birthday gift for Autonagar Surya theatrical trailer, Samantha in Auto nagar surya

Naga Chaitanya Autonagar Surya theatrical trailer launch, birthday gift for Autonagar Surya theatrical trailer, Samantha in Auto nagar surya

‘ఆటోనగర్ సూర్య ’ వచ్చేశాడు

Posted: 11/22/2013 07:22 PM IST
Naga chaitanya autonagar surya theatrical trailer launch

సినిమా దర్శకులు కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు. ఇటీవలి కాలంలో హీరో, హీరోయిన్ల బర్త్ డేల కానుకగా సినిమా ట్రైలర్లను గిఫ్టుగా విడుదల చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాజమౌళి ప్రభాస్, అనుష్క బర్త్ డేలకు ‘బహుబలి ’ మేకింగ్ వీడియోలను విడుదల చేసి వారిని ఆనంద పరిచాడు. ఇఫ్పుడు దర్శకుడు దేవా కట్టా కూడా నటుడు నాగచైతన్యకు బర్త్ డే కానుకగా తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఆటోనగర్ సూర్య ’ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసి గిఫ్టుగా ఇచ్చాడు.

నాగచైతన్య – సమంతా జంటగా ఆర్ ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా ఆర్థిక కారణాలతో ఆగిపోయి, ఇటీవల షూటింగు ప్రారంభించుకొని పూర్తి కావచ్చింది. ఈ చిత్రం ఆడియోని త్వరలో విడుదల చేసి, డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రం  ఇప్పటికే ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఇన్ని రోజులు ఆలస్యం అయినా చైతూ బర్త్ డే నాటికి తిరిగి ప్రారంభించుకొని విడుదలకు సిద్దం అవుతుండం సంతోషకరమైన విషయమే.

 
If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles