Akkineni akhil small role in manam movie

akkineni akhil small role in manam movie, Akkineni Akhil's grand entry with Manam, Akhil Guest role in manam, Akhil Akkineni debut Movie Manam, Akhil Guest role in Akkineni Multistarrer Manam

akkineni akhil small role in manam movie, Akkineni Akhil's grand entry with Manam, Akhil Guest role in manam, Akhil Akkineni debut Movie Manam, Akhil Guest role in Akkineni Multistarrer Manam

మనంలో అఖిల్ ఉన్నాడు ? లేడు ?

Posted: 11/22/2013 10:51 AM IST
Akkineni akhil small role in manam movie

అక్కినేని త్రయం కలిసి నటిస్తున్న ‘మనం ’ సినిమా పై ఇండస్ట్రీ ఎంతో ఆసక్తితో ఉన్నది. తొలిసారిగా ఒక కుటుంబానికి చెందిన హీరోలందరు తెర పై కనిపించబోతుండంతో అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పై గత కొన్ని రోజుల నుండి ఫిలిం నగర్ నుండి రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటిస్తున్నాడని, కాదు నటించడం లేదని, ఇందులో అఖిల్ ఉన్నాడు కానీ లేడని ఇలా రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అఖిల్ ఇందులో నటిస్తున్నాడు కానీ ఆయన పాత్ర ఏమీ ఉండదు. అంటే మ‌నం ప‌తాక స‌న్నివేశాల్లో అఖిల్ బొమ్మ మాత్రం చూపిస్తార‌ట‌. నాగేశ్వర‌రావు చిన్నప్పటి ఫొటో రూపంలో అఖిల్ క‌నిపిస్తాడ‌ట‌. అంతే. ఆ పాత్రకు డైలాగులు, క‌ద‌లిక‌లు ఉండవని అంటున్నారు.

ఇదే విషయాన్ని ఆ చిత్ర యూనిట్ సభ్యలుకు సినిమా రిలీజ్ వరకు గోప్యంగా ఉంచాలని నాగార్జున సూచించినా ఇటీవలే ఈ విషయం బయటపడటంతో నాగార్జున వారి పై అగ్గి మీద గుగ్గిలం అయ్యాడని ఫిలింనగర్ టాక్. కుటుంబ త్రయం అంతా కలిలి నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ లేడంటే సినీ జనాల చెవ్వుల్లో పువ్వులు పెట్టినట్లే అవుతుందేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles