Rajamouli s sye might take him international

Sye film, Rajamouli, sye film, Sye movie, Rajamouli movies, Rajamouli direction, Nithin movie, Sye cast, Nitin’s career, Jakkanna, game, Rugby, Raajamouli official facebook, Hateraka – coach of Indian Army’s Rugby team, International Rugby Board, promotional material, Rugby game

Sye movie, Rajamouli movies, Rajamouli direction, Nithin movie, Sye cast, Nitin’s career, Jakkanna, game, Rugby, Raajamouli official facebook, Hateraka – coach of Indian Army’s Rugby team, International Rugby Board, promotional material, Rugby game

రాజమౌళికి మరో గౌరవం దక్కింది

Posted: 11/20/2013 09:25 PM IST
Rajamouli s sye might take him international

దర్శకుడు రాజమౌళి పేరు ఈ మధ్య కాలంలో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మార్మోగుతుంది. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహించిన ‘ఈగ ’ సినిమా ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రాల్లో అవార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతనికి మరో అరుదైన గౌరవం దక్కింది. చాలాకాలం క్రితం నితిన్‌ హీరోగా రాజమౌళి ‘సై’ అనే సినిమా తెరకెక్కించిన విషయం విదితమే. ఈ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈయన రూపొందించిన ఆ సినిమాలో ప్రధాన అంశంగా రగ్బీ క్రీడను ఎంచుకున్నాడు.

ఈ ఆట నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడే మూడు సినిమాలొచ్చాయట. ఈ సినిమాను భారత రగ్బీ కోచ్ విల్లీ హటేరక చూడటం దానికి ముగ్దుడు కావడం జరిగాయట. ఆయన వెంటనే అంతర్జాతీయ రగ్బీ బోర్డ్‌ ప్రమోషన్‌ కార్యక్రమం కోసం రాజమౌళి పేరుని ప్రతిపాదించడం జరగటం, ఆ ప్రమోషన్‌ కోసం రాజమౌళిని దర్శకుడిగా అంతర్జాతీయ రగ్బీ బోర్డ్‌ ఎంచుకొవడం జరగిందని స్వయంగా దర్శకధీరుడే ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకొని తన అభిమానులను ఖుషీ చేశాడు. ఏమైనా ఎప్పుడో ఏడేళ్ళ క్రితం వచ్చిన సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు రావడం అంటే ఆశ్చర్యమే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles