Kajal agarwal controversial comments on shriya

Kajal Agarwal controversial comments on Shriya, kajal hot comment on shriya, kajal heroine, kajal hot comment on shriya, shriya is given retairment, kajal comment kollywood hot debate, shriya fire kajal.

Kajal Agarwal controversial comments on Shriya, kajal hot comment on shriya, kajal heroine, kajal hot comment on shriya, shriya is given retairment, kajal comment kollywood hot debate, shriya fire kajal

కాజల్ పై కారాలు మిరియాలు నూరుతుంది

Posted: 11/06/2013 10:04 AM IST
Kajal agarwal controversial comments on shriya

సినీ తారామణుల మధ్య విపరీతమైన పోటీ ఉండి, ఒకరి అవకాశాల్ని మరొకరు తన్నుకుపోతున్నప్పుడు ఒకరి పై ఒకరికి విపరీతమైన కోసం ఉంటుంది. ఆ కోపంలో మీడియాతో మాట్లాడే అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా చెలరేరి పోతుంటారు. కానీ అసలే అవకాశాలు లేక అనేక పాట్లు పడుతున్న హీరోయిన్ పై కాజల్ ఓ టీవీ ఇంటర్యూలో నోరు పారేసుకొని ఆమె కోపానికి గురికావాల్సి వస్తుంది.

ఇటీవల తమిళ హీరో కార్తీతో కలిసి ఓ టీవీఛానల్ ఇంటర్యూలో మాట్లాడుతుండగా.... యాంకర్ కాజల్ ని ప్రస్తుతం రిటైర్ అవ్వాల్సిన స్థితిలో ఉన్న హీరోయిన్ మీ దృష్టిలో ఎవరు ? అని అడగ్గానే.... శ్రీయ అని తడుముకోకుండా చెప్పింది. దాంతో అక్కడున్న యాంకర్ తో పాటు, హీరో కార్తీ కూడా విస్తుపోయారు. ప్రస్తుతం కాజల్‌కి ఉన్న పోటీదారుల్లో శ్రీయ లేదు కూడా. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. మరి అలాంటప్పుడు అంత నిక్కచ్చిగా శ్రీయ పేరు ఎలా చెప్పగలిగింది కాజల్ అంటూ కోలీవుడ్‌లో ఒకటే చర్చ.

అయితే వీరిద్దరి మధ్య ఎక్కడో చెడిందని, అందుకే ఇలా మాట్లాడి ఉంటుందని అంటున్నారు. ఆ నోటా, ఈ నోటా ఈ విషయం శ్రీయ చెవిలో పడటంతో ఇప్పుడు కాజల్  పై కారాలు మిరియాలు నూరుతుందట. నాకు నటించే వయస్సు ఇంకా అయిపోలేదని, ఏదో టైం బాగోలేక అవకాశాలు రావడంలేదని అంత మాత్రానా నన్ను రిటైర్డ్ అవ్వమని చెప్పడానికి ఆమె ఎవరు అని రుసరుసలాడుతుందట. మరి వీద్దరి మధ్య వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles