Radhika apte in balakrishna legend movie

Bollywood actress Radhika Apte has been confirmed as the leading lady opposite Nandamuri Balakrishna in his upcoming yet-untitled Telugu action drama that also features Sonal Chauhan.

బాలయ్యకు పిల్ల దొరికింది

Posted: 09/20/2013 07:30 PM IST
Radhika apte in balakrishna legend movie

గత కొన్ని రోజుల నుండి సీనియర్ హీరో అయిన బాలయ్యకు హీరోయిన్ ప్రాబ్లమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈయన సరసన నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. సినిమాకు ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉండగా, మొదట సోనాల్ చౌహాని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కోసం వేట సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యకు పిల్ల దొరికిందని అంటున్నారు. దక్షిణాది హీరోయిన్లు ఎవరూ నటించడానికి ముందుకు రాకపోవడంతో బాలీవుడ్ హీరోయిన్ అయిన రాధిక ఆప్టేను ఎంపిక చేసుకున్నారని లేటెస్ట్ ఇన్ఫో. గతంలో తెలుగు తెర పై రక్తచరిత్ర , ధోనీ సినిమాలలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో కొనసాగుతోంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'లెజండ్' అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles