Kandireega director to direct pawan kalyan

kandireega director to direct pawan kalyanm, Santosh Srinivas direct to pawan, pawan-dil raju movie director

kandireega director to direct pawan kalyanm, Santosh Srinivas direct to pawan, pawan-dil raju movie director

పవన్-దిల్ రాజు సినిమా దర్శకుడు ఇతడే

Posted: 09/02/2013 05:22 PM IST
Kandireega director to direct pawan kalyan

టాలీవుఢ్ స్టార్ హీరోలకు స్టార్ డైరెక్టర్లంటే బోర్ కొట్టిందో లేక కొత్త దర్శకులను ప్రోత్సహించాలని శపథం చేశారో కానీ టాప్ హీరోలంతా యువ దర్శకులకే అవకాశాలు ఇస్తున్నారు. రచయితల నుండి దర్శకత్వ శాఖకు షిప్ట్ అయిన వారు తనదైన రీతిలో రాణిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ, వక్కంతం వంశీ వంటి వారు ఇప్పటికే బడా హీరోలతో అవకాశాలు దక్కించుకున్నారు. ఇక మొదటి సినిమా ‘కందరీగ ’ తో మంచి పేరు తెచ్చుకున్న  సంతోష్ శ్రీనివాస్  కూడా తన రెండో సినిమానే జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో స్టార్ హీరో సినిమాకు కమీట్ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘రభస ’ చిత్రం తరువాత  పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రం చేయడానికి కమీట్ అయ్యాడని అంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా శ్రీనివాస్ చెప్పిన కథ విని వెంటనే ఓకే చేశాడని, ఈ చిత్రన్ని దిల్ రాజు నిర్మించడానికి రెడీ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. సో... దిల్ రాజు... పవన్ కాంబినేషన్లో వచ్చే చిత్రానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నమాట. ఇక చిత్రం పక్కా, మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో తెరకెక్కనుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles