Chennai express collection crosses rs 200 cr mark

chennai express box office, chennai express, shahrukh khan, deepika padukone, rohit shetty

Chennai Express business collection has crossed Rs 200 crore at worldwide Box Office in 6 days business

ఎక్స్ ప్రెస్ కి కలెక్షన్ల వరద

Posted: 08/15/2013 07:37 PM IST
Chennai express collection crosses rs 200 cr mark

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ సినిమా ఏ క్షణాన విడుదల చేశారో కానీ తాజాగా తాను నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ సినిమా బాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతూ... కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది. తాజాగా ఈచిత్రం రూ. 200 కోట్ల వసూళ్లను అధిగమించింది. కేవలం 6 రోజుల్లోనే ఇంత పెద్దమొత్తాన్ని కలెక్ట్ చేసిన చెన్నై ఎక్స్‌ప్రెస్.....గతంలో 10 రోజులకు పైగా సమయం తీసుకుని 200 కోట్లు వసూలు చేసిన సల్మాన్ ‘ఏక్ థా టైగర్' రికార్డును అధిగమించింది. ఆగస్టు 9న విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3500లకు పైగా స్క్రీన్లలో విడుదల చేసారు. ఈ సినిమా ఇక్కడనే కాకుండా సినిమా పాకిస్థాన్లో విడుదలై విజయఢంకా మోగిస్తుంది.  చెన్నై ఎక్స్ప్రెస్ విడుదలైన మొదటి రోజు మొదటి సినిమాకే పాక్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని అక్కడి స్థానిక పత్రిక తెలిసింది. తొలి వీకెండ్‌లోనే ఈచిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 100.42 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్ అయిన సోమ, మంగళ, బుధ వారాల్లో రూ. 34.37 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా గడిచిన ఆరు రోజుల్లో ఇండియాలో రూ. 134.79 కోట్లు రాబట్టింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాలీవుడ్ లో మరిన్నికొత్త రికార్డులు సాధించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles