Ram gopal varma kanyadanam

ram gopal varma kanyadanam, director ram gopal varma, ram gopal varma daughter marriage, varma daughter marriage, revathi varma, varma daughter revathi varma marriage, breaking news, film news, movie reviews, telugu movies

ram gopal varma kanyadanam, Ram Gopal Varma Daughter Marriage,

రామ్ గోపాల్ varma క‌న్యాదానం

Posted: 08/07/2013 01:01 PM IST
Ram gopal varma kanyadanam

సంచన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనమైన ప్రకటనలు చేసి మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు. అయితే తాజాగా రామ్‌గోపాల్ వ‌ర్మ క‌న్యాద‌నం చేయ‌బోతున్నాడు. అంటే ఆయన కూతురు రేవ‌తి వివాహం ఈనెలలో జరుగుతుందని సమాచారం. అదీ హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌బోతోందని వర్మ తెలిపారు. ప్రణ‌వ్ అనే వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకొంటోంది రేవ‌తి. ఈ ఇద్దరూ డాక్టర్లే. సెంటిమెంట్‌కి ఎక్కువ‌గా ప్రాధాన్యమివ్వడు వ‌ర్మ. నా కూతురు ఏం చ‌దువుతుందో నాకే తెలియ‌దు అని చెబుతుంటాడు. అలాంటి వ‌ర్మ ఇప్పుడు అల్లుడి కాళ్లు క‌డిగి క‌న్యాదానం చేయ‌బోతున్నాడు. సెంటిమెంట్‌కి ప్రాధాన్యం ఇవ్వక‌పోయినా... ఆయ‌న‌కి కూతురంటే ప్రాణ‌మ‌ట. ఇదివ‌ర‌కు జ‌రిగిన నిశ్చితార్థం వేడుక‌లో వ‌ర్మని చూసి రాజ‌మౌళి కూడా ఎంతో ముచ్చట‌ ప‌డ్డాడు. వ‌ర్మ అతిథుల‌ను ఆహ్వానిస్తూ నిశ్చితార్థ వేడుక‌ను జ‌రుపుతుంటే చూడ‌ముచ్చట‌గా ఉంద‌ని ట్వీట్ చేశారు. బ‌య‌ట‌కు ఆయ‌న ఎలా మాట్టాడినా ఇన్నర్‌గా మాత్రం ఆయ‌న‌లోనూ భావోద్వేగాలున్నాయ‌ని చాలాసార్లు రుజువైంది. కూతురు ప్రేమ పెళ్లి పట్ల తండ్రి విలన్ గా మారుతున్న ఈ రోజుల్లో వర్మ తన కూతురు ప్రేమించిన వరుడికి ఇచ్చి చెయ్యటం చాలా గొప్ప విశేషమని సీని పెద్దలు అంటున్నారు. ఎప్పుడు తన సినిమాలతో ప్రజలను భయపెట్టే వర్మలో కుటుంబ సెంటిమెంట్ ఉన్న విషయం వర్మ కూతురు ప్రేమ పెళ్లి విషయంలో బయటపడింది. అయితే వర్మ దర్శకత్వంలో వర్మ కన్యాదానం అనే సెంటిమెంట్ సినిమా తీసిన ఆశ్చర్య లేదని సినీ పెద్దలు అంటున్నారు. అయితే కన్యాదానం పేరుతో తెలుగు సినిమా వచ్చినట్లు కొంతమంది అంటున్నారు. అయితే దానికి వర్మకన్యాదానం సీక్వెల్ గా మార్చిన ఆశ్చర్యం లేదని అందరు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles