Hansika gives green signal for nagachaitanya

Hansika gives green signal for Nagachaitanya, hansika in naga chaitanya movie, nagachaitanya with hansika, hansika hot photoshoot, hello brother telugu movie remake

Hansika gives green signal for Nagachaitanya, hansika in naga chaitanya movie, nagachaitanya with hansika, hansika hot photoshoot, hello brother telugu movie remake

చైతూ ప్రక్కన చేరిన హన్సిక

Posted: 07/31/2013 11:03 PM IST
Hansika gives green signal for nagachaitanya

బబ్లీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న హన్సికకు ఇప్పుడు టాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. నాగార్జునతో ‘ఢమరుకం ’ సినిమా తీసిన శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో నాగ్ హిట్ చిత్రం అయిన ‘హలో బ్రదర్ ’ సినిమా రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శివప్రసాద్ రెడ్డి నిర్మించబోతున్నాడని, ఇందులో హన్సిక చైతూ సరసన జోడి కట్టబోతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం పై ఆ మధ్య స్పందించిన హన్సిక నేను చైతూ సరసన నటించడం లేదని, నేను ఏ సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది. కానీ ఈ సినిమాకు కాస్త నిర్మాత మారడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. ఆయన చైతూ సరసన హన్సిక నటించబోతుందని,  ఈ సినిమా సెప్టెంబర్లో ప్రారంభమవుతుందనీ, ఆకుల శివ దీనికి అద్భుతమైన కథ ఇచ్చాడనీ తెలిపాడు. హన్సిక కాదు కాదంటూనే చైతూ సరసన చేరిందని సినీ జనాలు అంటున్నారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటే ఇదేనేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles