Rajamouli prabhas bahubali shooting begin

bahubali shooting starting, Bahubali shooting begin, july 8th, director rajamouli, actress anushka, hero prabhas, hero daggubati rana as villan in bahubali

Rajamouli's Mangnus-opus Bahubali starring Prabhas will commence its principal shooting from Saturday (July 6) in Kurnool.

‘బహుబలి ’ షూటింగు పట్టాలెక్కింది..

Posted: 07/06/2013 12:35 PM IST
Rajamouli prabhas bahubali shooting begin

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘బహుబలి ’ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయినా ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు పట్టాలెక్కనుందా అని చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ప్రారంభం వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా రేపటి నుండి (జూలె 8 ) నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.  మొదట ఈ సినిమా  కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరిపిన అనంతరం హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో పాత్ర కోసం ప్రభాస్ ఇప్పటికే వివిధ విద్యలతో పాటు, గెడ్డం కూడా భారీగా పెంచేశాడు. ఇందులో ప్రభాస్ ఢిఫరెంటుగా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హీరో రాణాను తీసుకున్నాడు. ఈ చిత్రంలో అనుష్క ప్రదాన పాత్ర పోషిస్తుంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా పై అన్ని భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles