Reliance bags zanjeer rights for 105 crores

Reliance bags Zanjeer rights for Record Price, zanjeer rights sold for record price, zanjeer rights sold for Rs 105 Crores, Relaiance media bags zanjeer rights

Bollywood source said that, Theatrical rights of Ram Charan’s debut hindi movie Zanjeer have been bagged by Reliance Entertainment Pvt Ltd by shelling out whopping Rs.105 Crores. As per the buzz, Zanjeer will be hitting the screens on September 6th this year.

జంజీర్ రైట్స్ 105 కోట్లకు

Posted: 07/04/2013 08:27 PM IST
Reliance bags zanjeer rights for 105 crores

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారి బాలీవుడ్ లో నటించిన రీమేక్ చిత్రం జంజీర్ రైట్స్ దిమ్మతిరిగే రేటుకు అమ్ముడైనట్లు బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న చరణ్ మొదటి సారి హిందీలో నటించిన ఈ చిత్రానికి ఎవరూ ఊహించనంత రేటు పలికింది. ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ అయిన రిలయన్స్ 105 కోట్లు చెల్లించి డిస్టిబ్యూషన్ రైట్స్ ని తీసుకుందని సమాచారం. ఒక్క తెలుగులోనే దాదాపు యాభై కోట్లకు పైగా వసూళ్లు చేసే స్టామినా ఉన్న చరణ్ సినిమాకు, దక్షిణాదిలో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ఈ మాత్రం పెట్టి కొనుగోలు చేయడం తప్పేంకాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 80 నుండి 90 కోట్ల వసూళ్ళను ఈజీగా సాధిస్తుందనే ధీమాతో ఈ చిత్రం రైట్స్ ఇంత భారీ రేటు చెల్లించి కొన్నట్లు చెబుతున్నారు. హిందీలో ‘జంజీర్ ’ పేరుతో... తెలుగులో జంజీర్ చిత్రాన్ని ‘తుఫాన్' పేరుతో, మళయాలంలో ‘ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెందర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు లీగల్స్ సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు ఆ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రలయర్ ని జులై 5 న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో రాచ్ చరణ్ సరసన సెక్సీలేడీ ప్రియాంక చోప్రా నటించింది. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు. చరణ్ సినిమాకు ఇంత రేటు పలకడంతో తెలుగు వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles