Nani starrer paisa release delayed

nani, krishna vamsi, paisa, No Buyers for paisa movie, No Buyers for paisa movie east and west Dists

Paisa seems to be taking its own time to come to the theatres. Directed by Krishna Vamsi, this film stars Nani and Catherine Tressa in the lead. Krishna Vamsi was hoping to bounce back with this film. No promotion or publicity activity is being done for the film.

‘పైసా ’ ని కొనేవారు లేరు

Posted: 07/02/2013 04:32 PM IST
Nani starrer paisa release delayed

టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడమే కాకుండా, నిర్మాతలకు కూడా పెట్టిన పెట్టుబడి రాకుండా పోతున్నాయి. అసలే వరుస ప్లాపులతో కృష్ణవంశీతో సినిమాలు ఎవరూ తీయకపోవడంతో తానే స్వయంగా పెట్టుబడి పెట్టి దర్శకత్వం వహించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హీరో నానితో ‘పైసా ’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకొని, ఆడియోను కూడా విడుదల చేసుకొని చాలా రోజులు అయింది. ఆడియో ఎలా ఉందన్న సంగతి ప్రక్కన పెడితే... ఈ సినిమా ఇంత వరకు ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేం. దీని పై ఫిలిం నగర్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే... ఈ సినిమా కోసం కృష్ణవంశీ భారీగా ఖర్చు చేశాడని, హీరో నాని మార్కెట్ స్థాయిని మించి ఖర్చు చేసేసరికి బడ్జెట్ తడిసి మోపెడు కావడంతో ఈ సినిమా రేటును భారీ చెప్పడంతో బయ్యర్లు కొనడానికి ముందుకు రావడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఎవరైనా కొత్త వారు కొనే ధైర్యంచేద్దామన్నా కృష్ణవంశీ గత చిత్రాల రికార్డును చూసి భయపడి పారిపోతున్నారట. ఏదేమైనా కృష్ణవంశీ ‘పైసా ’ సినిమాను పైసలు పెట్టికొనే వారు కరువయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles