Trisha clarify about balakrishna movie

evi sri prasad, trisha, balakrishna, boyapati srinu, charmy

wana clarify n say i havnt signed anythn new in tamil or telugu as of now. Busy with my current films at d moment n wen i do sign another film ul hear it from me first.cheers Trisha tweeted

త్రిష కూడా తిరస్కరించింది

Posted: 06/21/2013 08:52 PM IST
Trisha clarify about balakrishna movie

నందమూరి హీరో బాలక్రిష్ణ అంటేనే హీరోయిన్లు ఆమడ దూరం పారిపోతున్నారు. ఈయన తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. జులై షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో ఇంత వరకు హీరోయిన్ మాత్రం ఖరారు ఖాలేదు. ఈయన సరసన మిస్ వరల్డ్ దగ్గర నుండి వెండి తెర బ్యూటీలు అయిన పలువురి పేర్లు వినిపించాయి. వారిలో త్రిష పేరు కూడా ఉందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఛార్మి, త్రిష ఫైనల్ అవుతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల పై త్రిష సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా స్పందించింది. తాను బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా లో నటించడంల లేదని, నేను ఏ భాషలో కొత్త సినిమాకు సైన్ చేయలేదని ఒక వేళ చేస్తే నేనే స్వయంగా వెల్లడిస్తానని చెప్పింది. దీంతో బాలయ్య ఆశలు మళ్లీ నీరుగారి పోయాయి. ఎవరో ఒకరితో అడ్జెస్ట్ అవుదామనుకున్న బాలయ్య కు త్రిష ఈ విధంగా హ్యాండ్ ఇచ్చేసరికి సినీ జనాలు బాలయ్యలో సత్తా అయిపోయిందని, అందుకే ఆయనతో చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles