Samantha ready for small films

samantha, nagachaitanya, pawan kalyan, samantha, south india actress, only small films, manam and neethane yen ponvasantham films

Samantha says she wants to be part of small films next year. Probably not to bogged down by excess work. Or may be try hands in something different. Once she completes her films in Telugu this year, she has to move on to two other big movies in Tamil next year. One is opposite Tamil superstar Vijay.

చిన్నదైనా, పెద్దదైనా ఓకే అంటున్న సమంతా

Posted: 06/19/2013 10:52 AM IST
Samantha ready for small films

కుర్రకారు కలల రాణిగానే కాకుండా, సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు సంవత్సరాల వరకు కాల్షీట్లు ఖాళీ లేకుండా డైరీ లో పేజీలు నిండిపోయిన బిజీ హీరోయిన్. క్షణం తీరిక లేకుండా పలువురి హీరోలతో ఒక్కసారే నటిస్తున్న ఈ అమ్మడు రానున్న రోజుల్లో పెద్ద హీరోలకు తన ప్రక్కన స్థానం లేదని ట్విస్ట్ ఇస్తూ... కథ నచ్చితే చిన్న సినిమాలు కూడా చేయాలని సమంత భావిస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన చిన్న సినిమాలు  తెలుగు, తమిళ , మళయాళం భాషల్లో మంచి ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో అక్కడి నుండి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.. చిన్న సినిమాల్లో నటిస్తే స్టార్‌ హీరోల చిత్రాల మాదిరి ఎక్కువ రోజులపాటు కాల్షీట్లు కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే ఈమెకు  పిజ్జా, అట్టకత్తి లాంటి సినిమాలు మంచి పేరు తేవడంతో పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా పెద్ద తేడా ఏం లేదు అని చెబుతుంది . చిన్న సినిమాల్లో నటిస్తే టైం, ఒత్తిడి రెండూ తగ్గుతాయని భావిస్తుంది ఈ అమ్మడు. ఈ అమ్మడు ఇచ్చిన ఆఫర్ తో చిన్న చితకా హీరోలు ఈమెతో నటించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. . ప్రస్తుతం సమంత నాగచైతన్య తో మనం షూటింగ్ ఫినిష్ చేసుకుని లేట్ నైట్ ప్లైట్ కు స్విజ్జర్ లాండ్ వెళ్ళింది. అక్కడ పవన్ కళ్యాణ్ తో షూటింగ్ లో పాల్గొంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles