Erica fernandez denies her telugu movie with balakrishna

devi sri prasad, balakrishna, boyapati srinu,Erica fernandez denies her telugu movie with balakrishna, Miss india Erica fernandez hot,Breaking News Film News Movie Reviews Telugu Movies

Well i would like to make a clarification here about the rumors of me doing a movie opposite balakrishna. This is a wrong rumor. I havn't committed for a telugu movie opposite balakrishna.

బాలయ్యకు పంచ్ ఇచ్చింది

Posted: 06/13/2013 05:51 PM IST
Erica fernandez denies her telugu movie with balakrishna

నందమూరి నట సింహం బాలయ్యకు మిస్ ఇండియా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బాలయ్య – బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందబోతున్న ‘జయసింహా ’ సినిమాలో 2012 లో మిస్ ఇండియాగా ఎంపికైన ఎరికా ఫెర్నాండేజ్ బాలయ్య సరసన హీరోయిన్ గా ఎంపికైయిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల పై ఎరికా ఫెర్నాండేజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.... తాను బాలకృష్ణ సినిమాలో నటించడం లేదని, బాలకృష్ణతో ఏ తెలుగు సినిమాకు కమిట్ కాలేదని, అదంతా అసత్య ప్రచారమే అని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. దీంతో బాలయ్యకు మళ్లీ హీరోయిన్ కరువు అయింది. ఇప్పటికే బాలయ్య సరసన నటించడానికి పలువురు విముఖత వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో విద్యాబాలన్ ని తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోయే సరికి ఎరికాను సంప్రదించారని అన్నారు.  ఎరికా ఫెర్నాండేజ్ ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ‘డేగ ’ చిత్రంలో నటిస్తుంది. ఈ భామ షాక్ ఇచ్చే సరికి దర్శక నిర్మాతలు హీరోయిన్ వేటలో పడ్డారు. బాలయ్య సరసన నటించడానికి ఏ అమ్మడు మొగ్గు చూపుతుందో చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సింహా తరువాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles