Allu arjun iddarammayilatho story leaked

Iddarammayilatho story leaked, Allu Arjun Iddarammayilatho Movie story leaked, Iddarammayilatho story, Allu Arjun Iddarammayilatho Movie story

Iddarammayilatho story leaked, Allu Arjun Iddarammayilatho Movie story leaked, Iddarammayilatho story, Allu Arjun Iddarammayilatho Movie story

అల్లు అర్జున్ మూవీ స్టోరీ లీక్

Posted: 05/29/2013 07:16 PM IST
Allu arjun iddarammayilatho story leaked

పూరీ జగన్నాథ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం విడుదలకు నోచుకున్న తరుణం లో ఈ సినిమా స్టోరీ లీక్ అయిందని, ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ చిత్రంలో రెండు రకాల పాత్రలు పోషిస్తున్న అల్లు అర్జున్ గిటారిస్టుగా, మరో వైపు మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని, హీరోయిన్స్ ఇద్దరిలో ఒకరు చనిపోతే మరొకరితో ప్రేమలో పడతాడని చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే స్టోరి అని కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం ఇద్దరు హీరోయిన్స్ చనిపోతారని ఇద్దరితో నడిపిన ప్రేమకథే ఈ చిత్రం యొక్క స్టోరీ అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్తల నేపథ్యంలో మరింత పబ్లిసిటీ వచ్చి చేరింది. ఏది ఏమైనా ఢిఫరెంటుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్న పూరీ ఎలాంటి స్టోరీతో సినిమా తీశాడో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. అన్నట్లు ఈ సినిమాను 800 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles