Anup rubens to compose tunes for ntr rabhasa

anup rubens, upcoming music director, demand increasing in tollywood, devisri prasad and thaman, famous music directos, top heros films making, chances decreasing

anup rubens, upcoming music director, demand increasing in tollywood, devisri prasad and thaman, famous music directos, top heros films making, chances decreasing

అనూప్ కి అదిరిపోయే ఛాన్స్

Posted: 05/25/2013 06:08 PM IST
Anup rubens to compose tunes for ntr rabhasa

సినిమా ఇండస్ఢ్రీలో ఎంతో టాలెంట్ ఉన్న నటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే వారి ప్రతిభ బయటకి వస్తుంది. అలాంటి వారిలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఒకరు. ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఇటీవల విడుదల అయిన 'గుండె జారి గల్లంతయ్యిందే', సినిమాకు హిట్ ట్యూన్స్ ఇచ్చి అందరిని ఆకర్షించాడు. అలాంటి అనూప్ రూబెన్స్ ఇప్పుడు బడా మ్యూజిక్ డైరెక్టర్లు అయిన దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్. తమన్ లకి చెక్ పెట్టబోతున్నాడు. తాజాగా ఇతడు తొలిసారిగా ఓ పెద్ద సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం దక్కింది. 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందే సినిమాకి సంగీత దర్శకుడిగా అనూప్ ఎంపికైనట్టు సమాచారం. మొదట ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ నే అనుకున్నారు. కానీ ఆ అవకాశాన్ని ఇతను ఎగరేసుకొని పోయాడని అంటున్నారు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తే కనుక వారి అవకాశాలను సగం వరకు గండి కొట్టడం ఖాయం అంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రంలో సమంతా కథానాయికగా నటిస్తోంది. మొత్తానికి అనూప్ తన మ్యూజిక్ తో ‘రభస ’ చేయబోతున్నాడన్న మాట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles