Kareena kapoor injured while shooting

Kareena Kapoor, Imran Khan, Puneet Malhotra, Gori Tere Pyaar Mein

Kareena Kapoor injured while shooting for Puneet Malhotra next

కరీనాకు గాయాలు

Posted: 05/08/2013 09:20 PM IST
Kareena kapoor injured while shooting

బాలీవుడ్ అందాల తార, సినీనటి కరీనాకపూర్ కి సినిమా షూటింగులో గాయాలు అయ్యాయి. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘గోరి తేరా ప్యార్ మేయిన్ ’ చిత్రంలో అమీర్ ఖాన్ అల్లుడు అయిన ఇమ్రాన్ ఖాన్ సరసన నటిస్తుంది. ఈ చిత్రానికి పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో కరీనా కపూర్ కి స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. దీంతో ఆమె ప్రమాదం తప్పిందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యలు. ప్రస్తుతం కరీనా కోలుకుంటుందని, స్వల్ప గాయాలు కావడం వల్ల ప్రాణాపాయం ఏమీ లేదని, రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పడంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఏది ఏమైనా కరీనాకు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles