Vidya balan in cannes film festival jury

Vidya Balan,Cannes film festival,Zoya Akhtar,the dirty picture,Shekhar Kapur,Sharmila Tagore,Opening ceremony,Nicole Kidman,Nandita Das,Lynne Ramsay

Bollywood actress Vidya Balan and 'Life of Pi' director Ang Lee are part of the prestigious 66th Cannes Film Festival's nine-member jury, headed by Hollywood director Steven Spielberg

విద్యాబాలన్ కి అరుదైన గౌరవం

Posted: 04/24/2013 08:02 PM IST
Vidya balan in cannes film festival jury

ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎంపికైంది. ప్రతిష్టాత్మక 66వ 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2013' లోజ్యూరీ మెంబర్గా ఆమె పాల్గొననున్నారు. కేన్స్ జూర్యీలో విద్యాబాలన్తో పాటు 'లైఫ్ ఆఫ్ పై' దర్శకులు యాంగ్లీ కూడా పాల్గొననున్నారు.

హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ అధ్యక్షతన తొమ్మిదిమంది సభ్యులుండే ఈ జ్యూరీలో జపనీస్ దర్శకుడు నవోమి కవాసే, నటి, నిర్మాత నికోల్ కిడ్ మన్, స్కాటిష్ దర్శకుడు లిన్నే రమ్సే, ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు డానియేల్, రుమేనియన్ దర్శకుడు క్రిస్టియన్ ముంగి, నటుడు క్రిస్ట్ఫో వాల్ట్జ్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో విద్య కూడా చేరింది. మే15 నుంచి 26 వరకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. డర్టీ పిక్చర్, కహానీ, పరిణిత చిత్రాల్లో అసాధారణ నటనతో విద్యాబాలన్ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. డర్టీ పిక్చర్ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles