Ram charan hot comment on allu sirish

ram charan launch gouravam trailer , allu sirish gouravam,mega power star ram charan, allu sirish gouravam. ... gauravam theatrical trailer , allari naresh action 3d first look teaser trailer, ram charan speech at gouravam trailer launch

ram charan hot comment on allu sirish

శిరీష్ హీరో అనగానే షాకయ్యాం-రామ్‌చరణ్

Posted: 04/12/2013 12:29 PM IST
Ram charan hot comment on allu sirish

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడు శిరీష్‌ కథానాయకుడిగా పరిచయమవుతన్న చిత్రం 'గౌరవం', యామిగౌతమ్‌ కథానాయిక. 'ఆకాశమంత' ఫేం రాధామోహన్‌ దర్శకుడు. ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాష్‌రాజ్‌ నిర్మిస్తున్నారు. థమన్‌ స్వరకర్త. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హీరో రామ్‌చరణ్‌ టీజర్‌ ఆవిష్కరించారు. అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ 'ట్రైలర్స్‌ అద్భుతంగా ఉన్నాయి. శిరీష్‌ ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకుంటాడు. మా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నందకు ఆనందంగా ఉంది' అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ 'బన్నిలా కాదు శిరీష్‌. ఏ విషయమైనా బాగా విశ్లేషిస్తాడు. రాధామోహన్‌ వంటి మంచి దర్శకుడితో శిరిష్‌ చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. హీరో శిరీష్‌ మాట్లాడుతూ 'బన్ని, రామ్‌చరణ్‌లను నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. శిరీష్ హీరో అవుతున్నాడనగానే... మా కుటుంబం మొత్తం కాసేపు షాకయ్యాం. ఎందుకంటే.. తను హీరో అవుతాడని మేం అనుకోలేదు. మామయ్య అల్లు అరవింద్ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థను ముందుకు తీసుకెళ్లేది శిరీషే అనుకున్నాం. కానీ మా ఊహలకు విరుద్ధంగా శిరీష్ హీరో అయ్యాడు’’ అన్నారు రామ్‌చరణ్.

శిరీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌరవం’. రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్ నిర్మించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను రామ్‌చరణ్ చేతుల మీదుగా గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘శిరీష్ అన్ని విషయాల్లోనూ అవగాహన ఉన్న వ్యక్తి. నాన్నకు అరవింద్‌గారిలా... శిరీష్ నాకు ఉత్తమ సలహాలిస్తాడు. నాకు ఏదైనా సమస్య ఎదురైతే నేను ముందు సంప్రదించేది శిరీష్‌నే. అలాంటి శిరీష్ హీరో కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించామని, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంలో శిరీష్ నటన హైలైట్‌గా నిలుస్తుందని రాధామోహన్ చెప్పారు.‘చదువు పూర్తయ్యాక గీతాఆర్ట్స్‌లో కొన్ని చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా చేశాను. హీరో అవ్వాలనే ఆలోచనైతే ఉండేది కాదుకానీ, నటనపై తృష్ణ మాత్రం అధికంగా ఉండేది. ఏదైనా మంచి సినిమాలో ఓ పాత్ర దొరికితే బావుండు అనుకునేవాడ్ని. నా కుటుంబ సభ్యులు, మిత్రులు ఈ విషయంలో నన్ను పోత్సహించడంతో ఇప్పుడు హీరోగా మారాను. ‘గౌరవం’ లాంటి మంచి సినిమా ద్వారా హీరోగా నా కెరీర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది. స్నేహితునికోసం వెతుక్కుంటూ వెళ్లిన యువకుని కథే ‘గౌరవం’.  ఈ నెల 19న విడుదల అవుతున్న ఈ చిత్రం మా టీమ్ మొత్తానికి గౌరవం తెచ్చిపెడుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ కరెక్ట్‌గా ఉండే శిరీష్, తన సినీరంగ ప్రవేశాన్ని కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles