Akkineni nageswara rao comment on movie awards

telugu film actor akkineni nageswara rao, legendary telugu film actor akkineni nageswara rao, akkineni nageswara rao, akkineni nageswara rao comment on movie awards, april 20th movie awards function, t subbyramireddy, tsr, movie actors,

akkineni nageswara rao comment on movie awards

గొప్పవాళ్లమని చెప్పుకొంటే లాభం లేదు?

Posted: 04/07/2013 11:43 AM IST
Akkineni nageswara rao comment on movie awards

ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో  డాక్టర్ అక్కినేని  నాగేశ్వరరావు  మాట్లాడిన మాటలను  ప్రతి తెలుగు వాడిని  ఆలోచింపచేశాయి.  తెలుగును మరిచిపోతున్న ఈరోజుల్లో మన తెలుగు వారి ప్రతిభ ఏమిటో ప్రపంచ స్థాయిలో తెలియాలి. తెలుగువారి ప్రతిభ నలుగురికి తెలియడం లేదు.  మనం ఎప్పుడూ ఒక మూలనే  ఉంటున్నాం. అసలు మనకు మనే గొప్పవాళ్లమని చెప్పుకొంటే లాభం లేదు. ఇకపై  మనం కూడా  జాతీయ స్థాయిలో  ప్రాచుర్యం సంపాదించాల్సిన అవసరం ఉందని అక్కినేని నాగేశ్వరరావు  అన్నారు.  అయితే  ఈ నెల 20న హైదరబాద్ లో  టీఎస్సార్  సినిమా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ పురస్కార కమిటికి అక్కినేని నాగేశ్వరరావు ప్రాతినిధ్యం  వహిస్తున్నారు.  అసలు తొలినాళ్లల్లో  అవార్డులు  ఎవరిస్తారా అని ఎదురుచూసేవాళ్లం ఆ తర్వాత  అవార్డులు  మరీ ఎక్కువైపోయాయి అనే పరిస్థితికొచ్చింది.  అయితే అవార్డులకున్న ప్రాధాన్యం  ఏ మాత్రం  తగ్గిపోలేదని  ఆయన అన్నారు.  సమర్థులైనవారిని  గౌరవించుకోడం మన బాధ్యత అని అక్కినేని గుర్తు చేశారు.


అయితే ఇటీవల కాలంలో  ఈ అవార్డులను ఒక బిజినెస్ గా మారిపోయింది. అర్హత లేని వారికి కూడా అవార్డులు వస్తున్నాయి. అవార్డులకు ఉన్న విలువ ఏమిటో వారు తెలుసుకోవాలని ఆయన ఆవేశంగా అన్నారు. అసలు సినిమా అనేది  షో బిజినెస్ లాంటిది. కానీ మన దగ్గర  జాతీయస్థాయి వేడుకలు జరగడంలేదని అక్కినేని ఆవేదన వ్యక్తం చేశారు. టి ఎస్సార్  పురస్కారాలతో మనకు కొంత ఉపశమనం కలిగిందని ఆయన ఆనందపడ్డారు. టిఎస్సార్ మాట్లాడుతూ..  సినిమా రంగం అంటే నాకు ఎంతో మక్కువ.  శక్తివంతమైన మాధ్యమం ఇది. ఆ అభిమానంతోనే  జాతీయస్థాయిలో  ఈ వేడుకను  నిర్వహిస్తున్నానని చెప్పటం జరిగింది.  ఈ నెల 20 జరిగే  ఈ వేడుకలో 2011, 12 సంవత్సరాలకి సంబంధించిన  అవార్డుల్ని ప్రదానం చేస్తారం.  అయితే  తెలుగు నటులతో పాటు ,  హిందీ, దక్షిణాది  చిత్ర పరిశ్రమలకు చెందిన  పలువురు సినీ ప్రముఖులు  ఈ వేడుకులో  పాల్గొంటారని  ఆయన చెప్పారు.  అసలు టాలీవుడ్ కు టీ సుబ్బిరామిరెడ్డికి ఉన్న సంబందం ఏమిటో ఎవ్వరికి అర్థం కాదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles