Amitabh beard made him misfit for janjeer role

amitabh bachan, jaya bhaduri, nt ramarao, satyanarayana actor, janjeer movie, toofan movie, ramchanran

amitabh beard made him misfit for janjeer role

amitabh-and-beard.png

Posted: 03/30/2013 01:57 PM IST
Amitabh beard made him misfit for janjeer role

amitabh-satyagraha

ప్రకాశ్ మెహ్రా నిర్మాణంలో సంచలనం సృష్టించిన నలభై సంవత్సరాల పాత హిందీ సినిమా జంజీర్ అప్పట్లో అమితాభ్ బచ్చన్ సినీ విజయయాత్రలో ఒక మలుపుగా నిలిచింది. అందులో అమితాభ్ సరసన నటించిన జయ భాదురీతో అప్పటికింకా పెళ్ళవలేదు. అదే కథతో మరోసారి అదే పేరుతో హిందీ లో నిర్మాణాన్ని చేపట్టిన సినిమాలో రామ్ చరణ్ తేజ, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్నారు. అయితే జంజీర్ అనగానే గుర్తుకొచ్చేది అమితాభ్ కాబట్టి ఆయన కూడా కొత్త సినిమాలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ లాంటి పాత్రను ధరిస్తే బావుంటుందని నిర్మాతలకు అనిపించివుంటుంది.

కానీ అమితాభ్ బచ్చన్ గడ్డం అందుకు అడ్డం వచ్చింది. ప్రస్తుతం ప్రకాశ్ ఝా దర్శకత్వంలో సత్యాగ్రహం సినిమా చిత్రీకరణ కోసం అమాంతం గడ్డం పెంచేసిన కారణంగా అమితాభ్ జంజీర్ లో పాత్రకి సరపోడని ఆయనకే అనిపించింది. అలా ఆయన గడ్డం ఆయనను ఆయన సక్సెస్ ఫిల్మ్ జంజీర్ రిమేక్ నుంచి దూరం చేసింది.

తెలుగులో జంజీర్ రీమేక్ ఇంతకు ముందు కూడా వచ్చింది. అందులో ఎన్ టి రామారావు, సత్యనారాయణలతో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే పాట అప్పట్లో బాగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. గడ్డం గాధను జంజీర్ దర్శకుడు అపూర్వ లఖియా కూడా ఔను ఆ మాట నిజమేనని ఒప్పుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shadow release is doubtful for ugadi
Writer kona venkat to direct pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles