Rudhrama devi moive music sittings

rudhrama devi moive, anushka gunashekar combo, rudhrama devi moive stills, rudhrama devi moive wallpapers, rudhrama devi moive music sittings, ilayaraja, london simphany orchestra, rudhrama devi music composing, anushka movies

rudhrama devi moive music sittings

1.gif

Posted: 02/07/2013 11:53 AM IST
Rudhrama devi moive music sittings

     rudhramadevi--music-sitting

       డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 'అరుంధతి' అనుష్కతో సొంత సంస్థ గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై రూపొందిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్‌ ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వెల్లడించారు. ‘ఈ కథ వినగానే ఇళయరాజా ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ లో తీస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్‌ కూడా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ లోనే వుండాలన్న ఉద్దేశంతో ఇళయరాజా స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తీసుకొని చేస్తున్నారు. చెన్నైలోని టెంపుల్‌ బే రిసార్ట్స్‌ లో ఈ చిత్రానికి సంబంధించిన ఆరు పాటల కంపోజింగ్‌ పూర్తయింది. ఎక్స్‌ ట్రార్డినరీ సాంగ్స్‌ ఇవ్వడమే కాకుండా ఈ పాటలను లండన్‌ లో సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్‌ చేయడానికి ఇళయరాజా నిర్ణయించారు. హై స్టాండర్డ్స్‌ తో రూపొందుతున్న 'రుద్రమదేవి' మ్యూజిక్‌ పరంగా కూడా ఓ ప్రెస్టీజియస్‌ మూవీ కానుంది’. అని తన ఆనందాన్ని వెలిబుచ్చారు.

       పరాక్రమశాలి 'రుద్రమ దేవి' అవతారంలో అనుష్క కనిపించబోతోన్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజరు విన్సెంట్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: కమల్‌ కణ్ణన్‌ (ప్రసాద్‌ ఇఎఫ్‌ఎక్స్‌), కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నీతా లుల్లా (జోధా అక్బర్‌ ఫేం), నిర్మాత: గుణశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun naga chaitanya multistarer movie
Pawan kalyan trivikram movie shooting in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles