Genius movie success meet

genius movie, genius movie success meet, omkar, genius movie posters, film news, movie news, genius movie teaser, genius movie wallpapers, movie reviews,

genius movie success meet

19.gif

Posted: 01/22/2013 06:34 PM IST
Genius movie success meet

ge

       అవసరమైతే 'ఆ నలుగురుని' చంపేసే రోజులు ఎంతోదూరంలో లేవని బాహాటంగా ఓ నిర్మాత ఉద్రేకంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన 'జీనియెస్‌' సక్సెస్‌మీట్‌ కార్యక్రమంలో ఓ నిర్మాత ధ్వజమెత్తారు. గత కొంతకాలంగా అగ్ర నిర్మాతల 'ఆ నలుగురు' ఆధిపత్యాన్ని గండి కొట్టాలని ఎలుగెత్తి చాటుతున్నారు. థియేటర్ల దొరక్క చిన్న నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు, సర్వీస్‌టాక్స్‌ పేరుతో నటీనటులు, చిన్న నిర్మాతలకు భారం, టిక్కెట్‌ పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయం వంటి వాటిపై ఈనెల 23న అంతా ఒక్కతాటిపై రావాలని పిలుపునిచ్చారు. విజయవంతంగా ప్రదర్శించబడుతున్న కొన్ని చిత్రాలను తీసేసి వాటి స్థానంలో సంక్రాంతి సందర్భంగా రెండే రెండు చిత్రాలు ప్రదర్శించడం చాలా దారుణమైన విషయమని డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మద్దినేని రమేష్‌ ధ్వజమెత్తారు.
        'సేవకుడు, జీనియస్‌తో'పాటు మరికొన్ని చిత్రాలను బలవంతంగా తీసేయడంపట్ల ఆక్షేపించారు. పెద్ద నిర్మాతలు థియేరట్లను తమ చేతుల్లో పెట్టుకొని చిన్న సినిమాను చంపేస్తున్నారన్నారు. ఇది ఇలానే కొనసాగితే చిన్న నిర్మాతలు సహనాన్ని కోల్పోయి థియేటర్లు లేకుండా చేసే వాళ్ళని చంపే రోజులు కూడా రాక తప్పవన్నారు. అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని విన్నవిస్తున్నామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను సభలో ఉన్న ప్రముఖ రచయితలు, నిర్మాతలు, దర్శకులు ఏ ఒక్కరూ కూడా ఖండించకపోవడం విశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swami rara movie update
Tamil heroine manasa movie update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles