Roja performence in pavitra movie

actress roja, pavitra movie, sriya pavitra, actress roja in pavitra, actress roja acts in pavitra, sriya pavitra movie performence in pavitra movie, pavitra movie first look, pavitra movie teaser,

roja performence in pavitra movie

9.gif

Posted: 01/05/2013 02:51 PM IST
Roja performence in pavitra movie

rr

        వెండితెరమీదా, అనంతరం రాజకీయరంగంలోనూ శహభాష్ అనిపించుకున్న రోజా ఇప్పుడు  ఓ విలక్షణమైన పాత్రను పోషిస్తోంది.  మాటలు రాని, వినికిడి సమస్యతో బాధపడే పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్రలో రోజా  అద్భుతంగా నటించిందని తెలుస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడ.. ఏమిటీ అని సందేహిస్తున్నారా.. చేపకళ్ల చిన్నది శ్రియ శరన్ వేశ్యగా నటిస్తున్న ‘పవిత్ర’ సినిమాలో.  గతంలో “దేవస్థానం” చిత్రానికి దర్శకత్వం వహించిన జనార్ధన్ మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కే సాధక్ కుమార్ మరియు జి మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
         మొన్ననే ఈ చిత్ర మొదటి లుక్ విడుదల చేసారు. కథాంశానికి వస్తే ఈ చిత్రం ఒక వేశ్య చుట్టూ తిరుగుతుంది, ఈ చిత్రంలో చివరగా ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు అవుతుంది.  శ్రియ వేశ్య పాత్ర చేస్తుంది. ఇప్పటికే చిత్రం అరవైశాతం టాకీ పూర్తిచేసుకుంది. నిన్న, ఇవాళ జూబ్లీహిల్స్‌ లోని ఓ భవంతిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజకీయనాయకుడిగా సాయికుమార్ నటిస్తున్నాడు. గతంలో రోజాతో డ్యూయెట్లు పాడిన సాయి ఈ సినిమాలో ఆమెకు భర్తగా నటిస్తున్నారు. రోజా కోడలి గా శ్రియ అభినయిస్తుంది. గతంలో అయ్యప్పగా కనిపించిన కౌశిక్ ఇందులో కొత్త తరహాలో కనిపిస్తాడు.

a
          సాయి కుమార్, రోజా మరియు ఏ వి ఎస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వి ఎన్ సురేష్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం ఈ నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకొని మార్చి లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranitha get chance in pawankalyan movie
Nayak movie theaters list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles