Pawan murugudas allu arvind movie

pawan kalyan, director murugudas, producer allu arvind,pawan kalyan movie, murugudas movies, allu arvind movies,gabbarsingh, gajani, tupaki, maheshbabu, maheshbabu movies

pawan murugudas allu arvind movie

1.gif

Posted: 01/02/2013 10:40 AM IST
Pawan murugudas allu arvind movie

 pawa

      బ్లాక్ బస్టర్ మూవీ ‘గజని‘తో తెరకెక్కాల్సిన కాంబినేషన్ అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనుకంజ వేయటంతో హీరో సూర్యకు వరమైంది. అయితే పవన్-మురుగదాస్ కాంబినేషన్లో సినిమా తీయాలన్న అల్లు అరవింద్ కళ ఇప్పుడు సాకారం కాబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలో కార్యరూపం దాల్చనుంది.

aaaa       యస్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సన్షేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ – స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంబినేషన్లో సరికొత్త చిత్రం త్వరలో రూపొందిద్దుకోబోతోంది. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో 'గజిని'  చిత్రాన్ని పలు భాషల్లో  నిర్మించి, భారీ విజయాన్ని నమోదు చేసుకున్న అల్లు అరవింద్... పవన్- మురుగ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా తీయాలనేది లక్ష్యంగా పెట్టుకున్న  సంగతి మనకుతెలుసు. అంతేకాదు 'తుపాకీ' చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో తీసుంటే చాలా పెద్ద హిట్టు అయ్యుండేదని ఆమధ్య అరవింద్ కామెంట్ చేసారుకూడా. ఏమయితేనే  మొత్తానికి గజనీ చిత్రంలో తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని చూడలేకపోయామనుకునే వారి కల ఇప్పుడు ఫలించనుంది.

mahesh_babu_family         ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్, పవన్ ఇద్దరూ న్యూ ఇయర్ వేడుకల్ని విదేశాల్లో జరుపుకోవటం కాకతాళీయం అయింది.  నూతన సంవత్సర వేడుకల సమయానికి వీరిఇద్దరు విదేశాల్లో వుండడం విశేషం. హీరో మహేష్ బాబు తన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం పూర్తి కావడంతో ఇప్పటికే కుటుంబంతో కలిసి హాలిడే గడపడానికి యూరప్ వెళ్ళిపోయాడు. టూర్ అనంతరం మహేష్ ఫ్యామిలీ సంక్రాంతికి ఇండియాకు తిరిగివస్తారు.  ఇక, పవన్ కల్యాణ్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను నటిస్తున్న 'హరే రామ హరే కృష్ణ' సినిమా షూటింగు కోసం స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో ఉన్నారు. ఈ 26 న అక్కడ షూటింగు మొదలవుతుంది. ఇదీ.. కొత్త సంవత్సరంలో మన టాప్ స్టార్ల తొలిరోజు మజిలీ.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu in royal stag music add
Jandapai kapiraju movie shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles