Chiru in nayak repair work

Chiranjeevi gives suggestions to Nayak, Chiru in nayak repair work

Chiranjeevi gives suggestions to Nayak, Chiru in nayak repair work

Chiru in nayak repair work.png

Posted: 01/01/2013 05:20 PM IST
Chiru in nayak repair work

Vinayak_Chiru

నిన్న డిసెంబర్ 31 అంటే న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగితేలడానికి సిద్ధం అవుతారు అందరు. మరి ఈ మధ్యనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి కూడా ఓ ఢిల్లీలోనో లేక, పెద్దపెద్దవారితోనో పార్టీ చేసుకోవడానికి రెడీ అయ్యాడని అనుకుంటారు అందరు... అలా అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. మరి నిన్నరాత్రి ఆయన ఏం చేశాడంటే... తన కొడుకు రామ్ చరణ్ నటించిన ‘నాయక్ ’ సినిమాకి  తన అనుభవాన్ని అంతా రంగరించి, తుది మెరుగులు దిద్దడానికి పూనుకున్నాడట. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నాయక్' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా మరి అంచనాలకు తగ్గట్లు ఉందో లేదో అనే భయం ఆ టీమ్ కి ఉండటంతో ఒక్కసారి చిరంజీవికి ఆ సినిమా చూపిస్తే లోటు పాట్లు తెలుస్తాయని భావించడంతో ఆయన నిన్న రాత్రి తొమ్మిది గంటలకు నాయక్ సినిమాను చూసేందుకు రెఢీ అయ్యారు. నిన్న రాత్రి ఆయన ఈ చిత్ర దర్శక నిర్మాతలతో పాటు సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమా వీక్షించి, స్వల్పంగా మార్పులు చేర్పులు చేశారనీ, ఆయన సలహాలను, సూచనలను వాళ్లు నోట్ చేసుకున్నారని తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులు అవసరం అనుకుంటే వాటిని మళ్లీ రీ షూట్ చేస్తానని వినాయక్ చిరంజీవికి మాట ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. తన కొడుక్కి తనంతటి పేరు తీసుకురావడానికి చిరంజీవి అంత శ్రద్ధ తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి తుది మెరుగులు, వినాయక్ మెరుపులు కలిస్తే ‘నాయక్ ’ ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangaru kodipetta movie campaign
Anushka to act in kahaani remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles