Nayak hindi rights and boyapati charan moive

ramcharan nayak, ramcharan nayak hindi rights, boyapati-charan moive, ramcharan nayak teaser, boyapati srinu, ramcharan, vv vinayak, kajal, amalapaul, ramcharan nayak teaser

nayak hindi rights and boyapati-charan moive

24.gif

Posted: 12/28/2012 01:27 PM IST
Nayak hindi rights and boyapati charan moive

Nayakeee

       వెండితెరను ఊచకోత కోయగల 'దమ్ము'న్న దర్శకుడు బోయపాటి శ్రీను. యన్టీఆర్ తో తీసిన దమ్ము సినిమా తర్వాత కొన్ని కథలు పట్టుకుని పడిగాపులుపడినా మహేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలు పట్టించుకోలేదు. అయితే తాజాగా రామ్ చరణ్ బోయపాటి చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చరణ్ మ్యానరిజానికి తగ్గా కథ వినిపించటంతో బోయపాటి కలల ప్రాజెక్ట్ కు మోక్షం లభించబోతుంది.
          రాంచరణ్, బోయపాటి కాంబినేషన్లో ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ తమ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మిస్తాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగు ప్రారంభమవుతుంది.
        ఇదిలా ఉంటే.. రామ్ చరణ్–వివి వినాయక్ 'నాయక్' ఓ అద్భుతాన్ని నెలకొల్పింది. వెండితెరపై సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ఇద్దరు హీరోలు కలిసి నటించిన  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని తలదన్నింది. 'నాయక్ ' హిందీ డబ్బింగు హక్కులు 3.5 కోట్లకు అమ్ముడుపోయి, తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఇదే సమయంలో  'సీతమ్మ...' సినిమా హక్కులు 3 కోట్లకు అమ్ముడుపోవడం టాలీవుడ్ ను విస్మయానికి గురిచేసింది.  
     కాగా, ఇటీవల కాలంలో హిందీ సినిమాల శాటిలైట్ హక్కులు 30 నుంచి 50 కోట్ల మధ్యన వుంటుండడంతో, గత కొంత కాలంగా పలు హిందీ టీవీ చానెల్స్ తెలుగు సినిమాలను కొని, హిందీలోకి డబ్ చేసుకుని ప్రసారం చేసుకుంటున్నాయి.  ఇలా మన నిర్మాతలకు ఈ రూపంలో అదనపు ఆదాయం వస్తోంది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రెబల్' సినిమా 2.5 కోట్లకు అమ్ముడుపోయి సన్షేషన్ క్రియేట్ చేసిన సంగతికూడా ఈ కోవలోనే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh movies update
Ntr trivikram combination movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles