Nagababu and sivaji dubbing for pizza movie

suresh kondeti,suresh kondeti pizza movie, nagababu and sivaji dubbing for pizza movie, suresh kondeti pizza, hero vijaru sethupathi, dubbing artist priyanka, sivaji, naga babu,

nagababu and sivaji dubbing for pizza movie

11.gif

Posted: 12/07/2012 12:55 PM IST
Nagababu and sivaji dubbing for pizza movie

nagababu-dubbing1ee

       కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలని తెలుగుప్రేక్షకులకు అందించాలనే తపన నిర్మాత సురేష్ కొండేటికి ఎక్కువ. ఈ కోవలోనే అతని గత చిత్రాలు వచ్చాయి. తాజాగా  'పిజ్జా'ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆసక్తితో డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్నాడు సురేష్ కొండేటి. ఈ చిత్రం నచ్చి తమ్మారెడ్డి భరద్వాజ్‌గారు సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకు రావడం, ఒక హిట్‌ చిత్రం అందించబోతున్నామనే నమ్మకంతో సమన్యరెడ్డి సహనిర్మాతగా చేయడానికి అంగీకరించటం పట్ల  సురేష్‌ మాంచి కుషీగా ఉన్నాడు. 
         ఇక ఈ మూవీలోని హైలైట్స్ ఏంటంటే.. ఈ చిత్రంలోని పాత్రలన్నింటికీ తెలుగువారితోనే డబ్బింగ్‌ చెప్పించడం విశేషం. ముఖ్యంగా ఈ చిత్రంలోని పిజ్జా ఓనర్‌ పాత్రకు నాగబాబు చెప్పిన డబ్బింగ్‌ సినిమాకి హెల్ప్‌ అవుతుందంటున్నారు.  ఓనర్‌ పాత్రధారి బాడీలాంగ్వేజ్‌కి నాగబాబు చెప్పిన డబ్బింగ్‌ ఆప్ట్‌ గా ఉందని తెలుస్తోంది.

nagababu_n_shivaji-3ee
        అలాగే హీరో విజరు సేతుపతికి శివాజి వాయిస్‌ ఇచ్చారు. ఇప్పటివరకు శివాజి డబ్బింగ్‌ చెప్పిన చిత్రాలన్నీ హిట్‌ అవ్వడం గమనార్హం. 'చిత్రం' సినిమాలో ఉదరుకిరణ్‌కి, 'జయం, దిల్‌' చిత్రాలకు నితిన్‌కు, 'అందరూ దొంగలే' చిత్రంలో ప్రభుదేవా పాత్రకు, 'ఉల్లాసంగా ఉత్సాహంగా' హీరోకి.... ఇలా శివాజి పలువురు హీరోలకు వాయిస్‌ ఇచ్చారు. ఆ చిత్రాలన్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ 'పిజ్జా'కి కూడా వర్కవుట్‌ అవుతుందని చిత్ర నిర్మాతలు ఆశగా ఉన్నారు. 
         ఇక, హీరోయిన్‌ పాత్ర విషయానికి వస్తే.. 100% లవ్‌లో తమన్నా, ఇతర చిత్రాల్లో పలువురు ప్రముఖ కథానాయికలకు డబ్బింగ్‌ చెప్పిన ప్రియాంక ఈ చిత్రానికి కూడా చెప్పింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul in okkadu movie sequel
Ntr acts in ram kandireega2 movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles