Sada nav deep mytri movie highlights

mytri movie, heroine sada, hero navdeep, mytri movie highlights, mytri movie stills, mytri movie hot pics, mytri movie wallpapers, mytri movie teaser,

sada nav deep mytri movie highlights

7.gif

Posted: 11/29/2012 04:57 PM IST
Sada nav deep mytri movie highlights

     navdeep_sada_mythri_innereeee

       అందాల తార సదా, హీరో నవ్ దీప్ నటిస్తున్న తాజా చిత్రం ‘మైత్రి’. ఆ పాత్రలో సదా నటన అత్యంత అద్భుతం అంటూ ఆ చిత్ర యూనిట్ తెగ పొగిడేస్తుంది. సదా కెరీర్‌లోనే తొలిసారి 'మైత్రి'గా అర్థవంతమైన పాత్రని సదా చేసిందనేది నా అభిప్రాయం అంటున్నారు దర్శకుడు సూర్యరాజు. హను సినీ క్రియేషన్స్ పతాకంపై రాజేశ్‌కుమార్, కుమార్‌రాజా సంయక్తంగా నిర్మించిన 'మైత్రి' చిత్రంతో ఆయన డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.       ఈ సినిమా కి సంబంధించిన విషయాలను దర్శకుడు క్లుప్తంగా వివరించారు.  సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'మైత్రి'ని రూపొందించా. సదా పేరు మైత్రి అయితే నవదీప్ పేరు దీపు. అమెరికా నుంచి ఓ ముఖ్యమైన పనిమీద వారం రోజులు గడపడానికి వచ్చిన మైత్రి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం ఈ సినిమా. ప్రేక్షకుణ్ణి కచ్చితంగా సంతృప్తిపరిచే సినిమా.
        ఇక కథ విషయానికి వస్తే,  దీపు వీడియో ఆల్బమ్ డైరెక్టర్. భారతీయ స్త్రీ కట్టు బొట్టు, ఆమె గొప్పదనాన్ని చాటిచెప్పే ఉద్దేశంతో ఓ వీడియో ఆల్బమ్ రూపకల్పనకు నడుం బిగిస్తాడు. మొదట ఓ అమ్మాయితో షూటింగ్ ప్రారంభిస్తాడు. అయితే మైత్రిని చూశాక, అప్పటిదాకా పనిచేస్తున్న అమ్మాయికి బై చెప్పి, మైత్రిని ఒప్పించి, ఆమెతో ఓ బంగళాలో షూటింగ్ జరుపుతాడు. ఆ సందర్భంగా ఆ బంగళాలో అనూహ్యమైన సంఘటనలు కొన్ని జరుగుతాయి. అవన్నీ ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగిస్తాయి. ఆ సంఘటనల వెనుక ఎవరున్నారనేది  సినిమా చూసి తెలుసుకోమంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director rajamouli anchoring and dance
Goa beauty iliyana likes aged men  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles