Brahmins object denikaina ready movie

brahmins object denikaina ready movie, denikaina ready sensor, denikaina ready movie agitation, brahmin sanghams agitation for denikaina ready movie, denikaina ready movie teaser, manchu vishnu denikaina ready wallpapers

brahmins object denikaina ready movie

7.gif

Posted: 10/27/2012 05:35 PM IST
Brahmins object denikaina ready movie

Denikaina-Ready-Movie-Posters-1ee      

‘‘మా బ్రాహ్మణుల వేష భాషలను హస్యానికి వాడుకుంటారా ! బ్రాహ్మణుడి చేత హలీం తినిపించి మా కులాన్ని అవమాన పరుస్తారా  ! మేం అభ్యంతరం తెలిపిన సన్నివేశాలు వెంటనే తొలగించండి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’’ అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఫైరయ్యారు. నేపథ్యం ఏమిటంటే... విష్ణు – హన్సిక జంటగా నటించిన ‘దేనికైనా రెడీ’  విజయం సాధించిందని హీరో దర్శక నిర్మాతలు ఆనందంగా ఉంటే ఈ ఆరోపణలు వచ్చిపడ్డాయి. ఇటీవల ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా మీద ఆగ్రహంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలు అంతలోనే ఈ సినిమా రావడంతో మరింత ఆగ్రహంగా ఉన్నాయి.

     ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ బ్రాహ్మణ సేవా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విష్ణు - హన్సిక జంటగా జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో, తమ కులాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణ సేవా సంఘాలు ఈ రోజు హైదరాబాద్ - సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ, బ్రాహ్మణుల వేష భాషలను హాస్యానికి వాడుకోవడం పట్ల తీవ్రమైన అభ్యంతరాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో బ్రాహ్మణుడి చేత మాంసం - హలీం తినిపించడం తమ కులాన్ని అవమానపరచడమేనంటూ మండి పడ్డారు. తాము అభ్యంతరం తెలిపిన సన్నివేశాలను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna gets employment smart card
Amala paul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles