Yash chopra dead bollywood film director

yash chopra dead bollywood film director , and film maker

yash chopra dead bollywood film director

1.png

Posted: 10/22/2012 12:25 PM IST
Yash chopra dead bollywood film director

yash_chopra

బాలీవుడ్ దిగ్గజం.. దర్శకుడు, నిర్మాత యాష్ చోప్రా ముంబైలోని లీలావతీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న యాష్ చోప్రా వయసు 80 సంవత్సరాలు. 1932 లో లాహోర్ లో జన్మించిన యాష్ చోప్రా ముంబాయ్ వచ్చి ఐ.యస్.జోహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. 1959 లో 'ధూల్ కా పూల్' చిత్రంతో దర్శకుడుగా మారారు. 1973 లో యష్ రాజ్ ఫిలిమ్స్ నెలకొల్పి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. దీవార్, కభీ కభీ, త్రిశూల్, సిల్ సిలా, మషాల్, విజయ్, చాందిని, లమ్హే, డర్, దిల్ తో పాగల్ హై, జబ్ తక్ హై జాన్ ... వంటి జనరంజకమైన సినిమాలను తన సంస్థ నుంచి అందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో బాటు పద్మభూషణ్ కూడా అందుకున్నారు. యాష్ చోప్రా అన్న బి.ఆర్.చోప్రా కూడా ఫిలిం మేకర్ గా ఎంతో పేరు తెక్చుకున్నారు.
       అలాగే, చోప్రా తనయులు ఆదిత్య చోప్రా, ఉదయ చోప్రా కూడా సినిమా రంగంలో వారసులుగా కొనసాగుతున్నారు. హిందీ చిత్ర రంగం ఎదుగుదలకు తన వంతు  కృషి చేసిన యాష్ చోప్రాను బాలీవుడ్ ప్రముఖులు పెద్దన్నగా గౌరవిస్తారు. ఎంతో మంది హీరోలకు ఆయన స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చుతున్నారు.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero karti his wife ranjani pregnent
Sridevi tamil hero ajit new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles