Aish re entry a much talked about

Aishwarya Rai, Abhishek bacchan, Amithab, Bacchan family, Actress Aishwarya Rai Bacchan

Ash's re-entry... a much talked about. Aishwarya Rai Bacchan next movie.

Aish re-entry.. a much talked about.png

Posted: 10/04/2012 04:15 PM IST
Aish re entry a much talked about

Aiah

వెండితెర అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ ని పెళ్ళి చేసుకొని, గత సంవత్సరం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తను గర్భం దాల్చినప్పటి నుండి వెండితెరకు దూరం అయిన ఐశ్వర్యరాయ్ మళ్ళీ ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని వేలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో ఐష్ రీ ఎంట్రీ షారూఖ్ ఖాన్ తో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇలా అనేక పుకార్లు వస్తున్న సమయంలో ఐష్ కలుగ జేసుకొని, తన కూతురు ఆలనా, పాలనా చూసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నాననీ ... రీ ఎంట్రీ విషయమై తానింకా ఏమీ ఆలోచించుకోలేదని చెప్పింది.

అయితే తాజాగా ఆమె మణిరత్నం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. గతంలో ఈయనతో ‘రావన్ ’ అనే సినిమాలో నటించింది. మళ్ళీ ఇప్పుడు మణిరత్నం సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు బాలీవుడ్ జనాలు. మణిరత్నం కథ పై నమ్మకంతోనే ఐశ్వర్య ఆయనకు కమీట్ అయ్యింది, రీఎంట్రీ సినిమానే ఫెయిల్ అయితే మళ్ళీ అవకాశాలు రావనే ఉద్దేశ్యం కూడా కావచ్చు అంటున్నారు. ఇక మణిరత్నం తీయబోయే సినిమా . కొత్తగా పెళ్ళైన ఓ యువతీ తన భర్త మనసెరిగి నడుచుకోవడానికి ఎంతగా ఆరాటపడిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందట.  ప్రస్తుతం మణిరత్నం ఈ సినిమా స్క్రిప్ట్ పైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి అభిమానుల కోరిక నెరవేరబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha has no dates for pawan kalyan
Pawan works hard for cmgr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles