Power star new still

power-star-new-still, cameramen gangato rambabu, new still release today

power-star-new-still

41.1.png

Posted: 09/20/2012 05:07 PM IST
Power star new still

       సన్షేషనల్ న్యూస్... ఫస్ట్ ఆన్ తెలుగువిశేష్.కాం :  పవన్ కళ్యాణ్ – తమన్నా జంటగా నటిస్తోన్న పూరి జగన్నాథ్ చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు‘ ఆడియో ఫంక్షన్ రద్దయింది. క్యాసెట్స్ అండ్ సీడీస్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేసేస్తారు. 24వతేదీ ఉదయం నుంచీ ఈ పాటల క్యాసెట్లు మార్కెట్లో లభ్యమవుతాయి. అయితే ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను భారీ ఎత్తున అక్టోబర్ 1న చేయాలని నిర్మాత డివివి దానయ్య నిర్ణయించారు. ఇక..       

        పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలి బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన pawan_kal1సంగతి తెలిసిందే. దీనికి ధీటుగా అదే పంథా కొనసాగిస్తూ పవన్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు లోనూ పవన్ స్టిల్స్ రాకింగ్ చేస్తున్నాయి. ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది. దీనికి పవన్ అభిమానుల్లో విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఈ ప్రక్కన కనిపిస్తున్నదే ఆ లేటెస్ట్ పోస్టర్...
   కాగా, పవన్ తాజా చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా ముందుగా అనుకున్న తేదీ లోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు అనుకున్నట్టు అక్టోబర్ 11 న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 కి వాయిదా వేస్తున్నట్టు చెబుతున్నారు. అసలు మొదట్లో ఈ చిత్రం విడుదల తేదీ అక్టోబర్ 18 అన్న విషయం మనకు తెలిసిందే. అయితే, నిర్మాణ కార్యక్రమాలు త్వరగా పూర్తవుతున్నందున ఓ వారం ముందుకు తెస్తున్నట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఒరిజినల్ డేట్ కే వెళుతుండడం విశేషం!.   ఈ సినిమా ఆడియో వేడుక కూడా ఈ నెల 18 నుండి 24 కి వాయిదాపడింది. ఇది కూడా ఇంకా ఖరారు కాలేదు. ముఖ్య అతిధి చిరంజీవి వీలును బట్టి ఈ సర్దుబాటు జరిగినట్టు తెలుస్తోంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nageswararao birthday
Innocence of muslims movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles