Accident in gouravam shooting

accident in gouravam shooting , heroine yami gowtham injured allusirish radha mohan movie gouravam

accident in gouravam shooting

20.gif

Posted: 09/14/2012 08:25 PM IST
Accident in gouravam shooting

      ‘గౌరవం’ సినిమా షూటింగ్ లో హీరోయిన్ యాక్సిడెంట్ అయింది. అల్లు శిరీష్ - యామీ గౌతమ్ జంటగా రాధామోహన్ 'గౌరవం' అనే yami_innereeచిత్రాన్ని తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగులో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కథానాయిక యామీగౌతం గాయపడింది.
    అయితే.. ఆమెకి చిన్నపాటి గాయాలే అయ్యాయనీ ఆందోళన పడవలసిన పనిలేదని వైద్యులు చెప్పారు. ఈ షాక్ నుంచి తేరుకున్న యామీ గౌతమ్, తాను బైక్ పై వెళ్లే పాటను చిత్రీకరిస్తూ వుండగా, ఊహించని విధంగా ప్రమాదం జరిగిందనీ ... దేవుడి దయవలన చిన్న పాటి గాయాలతో బయట పడ్డానని చెబుతోంది. సమయానికి యానిట్ సభ్యులు స్పందించడం ... వైద్యులు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ షాక్ నుంచి తాను త్వరగా తేరుకున్నాని అంటోంది.
        రవిబాబు దర్శకత్వంలో 'నువ్విలా' చిత్రంలో నటించిన యామీ గౌతమ్, 'గౌరవం' చిత్రం పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడటంతో, ఆమె కుటుంబ సభ్యులు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా అనుకోని ఈ అవాంతరానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramyakrishna birthday
Double trouble movie progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles