Rajendra prasad movie dream

rajendra prasad movie dream

rajendra prasad movie dream

7.gif

Posted: 09/10/2012 04:55 PM IST
Rajendra prasad movie dream

       అందరినీ తన అసమాన్య హాస్య భరిత నటనతో మంత్రముగ్ధులను గావించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కొంత కాలంగా రూటు మార్చి సందేశాత్మకంగా తయారయ్యారు. ఆ నలుగురు తరహా చిత్రాల మీదే ఎక్కువగా ద్రుష్టి సారిస్తున్న రాజేంద్ర ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. 'డ్రీమ్‌' టైటిల్ పేరిట వస్తోన్న ఈ మూవీ ఇటీవలే సెన్సార్‌ పూర్తిచేసుకుంది. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మించింది. సెన్సార్‌ సభ్యుల ప్రదర్శన అనంతరం సెన్సార్‌బోర్డ్‌ చీఫ్‌ ధన లక్ష్మీ, ఇతర గౌరవ సభ్యులు, తమను ఎంతగానో మెచ్చుకున్నారని చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు.rajen_f

         'ప్రత్యేకంగా ఫలానా కేటగిరీ అనే పరిధి లేని కథ. రొటీన్‌గా మనం సినిమాలలో చూసే సన్నివేశాలు కానీ, పాత్రలు కానీ లేకుండా ప్రేక్షకుల ఊహకి అందకుండా రెండు గంటలపాటు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతీ సీన్‌లో ఉండే మిస్టరీ, రెండో అర్థభాగంలో బయటపడుతుంది. కథలోని ఒరిజినాలిటీ, స్క్రీన్‌ప్లేని కొత్తదనం, రాజేంద్రప్రసాద్‌ నటన సినిమాలో ప్రధానమైన హైలైట్స్‌. సినిమాను సెప్టెంబర్‌ 21న రిలీజ్‌ చేస్తున్నాం' అని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ గెటప్స్ ఆయన క్యారెక్టరైజైషన్ అందరినీ అబ్బుర పరుస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Three movies on rr movie makers banner
Priyamani charulatha postphone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles