Band balu movie starts

band balu movie starts, kamal and kamna jatmalani director venkat

band balu movie starts

1.gif

Posted: 09/08/2012 02:40 PM IST
Band balu movie starts

       నిన్నటి నుంచి యంగ్ బాలు బ్యాండ్ వాయింపు షురూ అయింది. ఏ సందర్భానికంటే.. కొంగొత్త  సినిమా కోసం ..  కమల్‌, band_baluకామ్నాజఠ్మలానీ జంటగా కమల్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న 'బ్యాండ్‌బాలు' చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. చింతలపూడి వెంకట్‌ దర్శకత్వంలో బి.కమలాకరరెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపుషాట్‌కు మురళీమోహన్‌ క్లాప్‌ ఇవ్వగా, తమ్మారెడ్డి భరధ్వాజ్‌ కెమేరా స్విచ్చాన్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.  హీరో కమల్‌ మాట్లాడుతూ నాకిది 5వ సినిమా. దర్శకుడు వెంకట్‌ నా మొదటి సినిమానుంచి పరిచయం. ఈ సినిమా నాకు గుర్తింపు తెస్తుందనే నమ్మకముంది. మూడునెలల్లో చిత్రాన్ని పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ బ్యాండ్‌ ట్రూప్‌లో పాటలు పాడుకునే ఓ విలేజ్‌ అబ్బాయి ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడితే ఏం జరిగింది? అనేది చిత్రకథ. కామెడీ, సెంటిమెంట్‌ తో సాగే అందమైన ప్రేమకథ. సందేశాత్మకంగా కూడా వుంటుంది. పాటలరికార్డింగ్‌ పూర్తయింది. చిన్నా చక్కటి బాణీలు ఇచ్చారు. అన్నివర్గాలవారిని అలరిస్తుందనే నమ్మకముందని తెలిపారు. హీరోయిన్ కామ్న మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగుతెరపై కన్పించబోతున్నాను. హీరోయిన్‌గానే నటిస్తున్నాను అని చెప్పారు. శ్రీహరి మాట్లాడుతూ దర్శకుడు వెంకట్‌ గతంలో నాచిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు. ఈ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుం టున్నాను అని ఆకాంక్షించారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Irani chai movie
Devadas route marchadu movie tanish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles