Nani movies progress

nani movies progress

nani movies progress

21.gif

Posted: 08/16/2012 10:01 PM IST
Nani movies progress

        నాని హీరోగా గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న 'జెండాపై కపిరాజు' మూవీ టీం ను సర్ప్రైజ్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. తర్వాత తేరుకుని, రాజమౌళీని, ఆయనతో బాటు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులనూ సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేశారు. ఇటీవల కొంతకాలంగా షూటింగులతోనూ, ప్రమోషన్ కార్యకలాపాలతోనూ అలసిపోయిన రాజమౌళి, హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుని, Nanieeఫ్యామిలీతో కలిసి గోవా వెళ్ళారు. సరిగ్గా ఇప్పుడే అక్కడ నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న 'జెండాపై కపిరాజు' చిత్రం షూటింగు కూడా జరుగుతోంది. దాంతో, మిత్రులను ఒకసారి కలిసి వెళదామన్న ఉద్దేశంతో రాజమౌళీ అలా చెప్పాపెట్టకుండా విజిట్ చేశారు.
        ఇలా ఉండగా,  క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇప్పటి వరకూ 80% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘పైసా’ అనేది వర్కింగ్ టైటిల్. ఇంకో 20 -25 రోజుల్లో ఈ చిత్ర చిత్రీకరణ పూర్తి చెయ్యాలనే దిశగా చిత్రీకరణ జరుగుతోంది. మలయాళీ భామ కాథెరిన్ థెరీస ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ద్వారా కృష్ణ వంశీ బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ కొట్టాలని చూస్తున్నారు. రాజకీయ అంశాలు కలగలిపిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan srinu vytla movie news
Ek tha tiger collections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles