Satya sequel coming soon

satya sequel coming soon

satya sequel coming soon

24.gif

Posted: 08/07/2012 09:14 PM IST
Satya sequel coming soon

       సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ క్రియేటివ్ మూవీ ‘సత్య’.  జేడీ చక్రవర్తి - ఊర్మిళ జంటగా గతంలో తెరకెక్కించిన 'సత్య' చిత్రం satya_eఅప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ముంబై మాఫియా నేపథ్యంలో 1998 లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 15 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకి  ఇప్పుడు సీక్వెల్ సిద్ధమౌతోంది. 'విక్కీ డోనార్' సినిమా ద్వారా నిర్మాతగా కూడా సక్సెస్ ను సాధించిన జాన్ అబ్రహం, ఇక తన సొంత బ్యానర్లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
   ఈ నేపథ్యంలో గతంలో ఘన విజయాన్ని సాధించిన 'సత్య'కు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో జేడీ చక్రవర్తి నటిస్తాడా? లేదంటే ఆ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'భూత్ - 2 ' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తి చేసిన తరువాత 'సత్య' సీక్వెల్ కి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశముంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రం త్వరలనే వెల్లడయ్యేఅవకాశం కనిపిస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram remuneration
Prabhas high quality pictures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles