Rama prabha birthday story

rama prabha birthday story

rama prabha birthday story

33.gif

Posted: 08/05/2012 08:23 PM IST
Rama prabha birthday story

       రమాప్రభ.. ఈ పేరు చెప్పగానే వెండితెరపై నవ్వులు పూస్తాయి. నాలుగు దశాబ్దాల సినీ రంగ జీవితంలో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోశించారామె. ఏ పాత్ర పోశించినా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. ప్రేక్షకున్ని కడుపుబ్బా నవ్వించేవారు. నాలుగు భాషల్లో నటించి మెప్పించారు. రమాప్రభ.. 1946 అక్టోబర్ 5న అనంతపురంజిల్లా కదిరిలో జన్మించారు. సొంత ఊరు మదనపల్లి సమీపంలోని రామాపురం. ramaకొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానం రమాప్రభ. మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ, మేనత్త రాజమ్మకు సంతానం లేకపోవడంతో రమాప్రభను పెంచుకున్నారు.  పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మతో కలిసి మద్రాసు చేరుకున్నారు. ఆ తరువాత నటనపై మక్కువ పెంచుకున్న ఆమె నాలుగు వేలకు పైగా తమిళ నాటక ప్రదర్శనలిచ్చారు. "కాదల్ పత్తాం పాసు" అనే తమిళ చిత్రం ద్వారా తమిళ చిత్ర సీమలో అడుగు పెట్టారు. 1966లో నిర్మించిన "చిలకా గోరింక" తెలుగు చిత్రం ద్వాకా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 14వందల చిత్రాల్లో నటించారు.
     తెలుగులో రమాప్రభ నటించిన జీవన జ్యోతి, మనుషులంతా ఒక్కటే, కార్తీక దీపం, ఇల్లు-ఇల్లాలు, ఓ సీత కథ, గోరింటాకు, సిరిసిరిమువ్వ, డబ్బుకు లోకం దాసోహం, అడవి రాముడు, సెక్రటరీ చిత్రాలు ఆమెకు మంచి పేరుతెచ్చాయి. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ.. అల్లు రామలింగయ్య, రాజబాబులకు జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆమె మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుతూ ఆంధ్రావిశేష్.కాం మరోసారి రమాప్రభకు బర్త్  డే విషెస్ తెలుపుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  100 years of music
Cameraman ganga tho rambabu an hungry reporter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles