Marriage praposals for salman khan

marriage praposals for salman khan

marriage praposals for salman khan

12.gif

Posted: 08/01/2012 06:58 PM IST
Marriage praposals for salman khan

      బాలీవుడ్ ముదురు బెండకాయ సల్మాన్ ఖాన్ మనసు ఇప్పుడు పెళ్లి మీదకు మళ్ళింది. ఇన్నాళ్లూ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా salman... మాట మళ్లిస్తూ వచ్చిన సల్మాన్, 'అమ్మాయిని చూడమని' ఇంట్లో వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మొదట్లో ఐశ్వర్యా రాయ్ తనను మోసం చేసిందంటూ మొత్తం పెళ్లి తంతు మీదే ద్వేషం పెంచేసుకున్నాడు. ఆ తర్వాత కత్రినా కూడా అలాగే ప్రవర్తించిందని ఇక అసలు పెళ్లే వద్దనుకున్నాడు. దాంతో, ఇక ఆ తర్వాత పెళ్లి ప్రస్తావనే ఎత్తలేదు. అయితే, హఠాత్తుగా ఈమధ్య మాత్రం పెళ్లి గురించి అడిగితే, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలన్న ఆలోచన ఏమీ లేదంటూ పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలెట్టాడు. తనను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూ కడుతున్నారని కూడా గొప్పలు చెప్పుకున్నాడు. ఇవన్నీ ఇలా ఉంచితే, ఇప్పుడు ఇంట్లో వాళ్లు మాత్రం చాలా సీరియస్ గా అమ్మాయి వేటలో పడ్డారట. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని కుటుంబం నుంచి అమ్మాయిని వెతికిపట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏమైనా, 47 ఏళ్ల వయసుకైనా మన కండల వీరుడు పెళ్లికొడుకైతే సంతోషమే కదా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra wishesh birthday wishesh to devi sri
Baba song for pawanism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles