Tapsi birthday today

tapsi birthday today

tapsi birthday today

6.gif

Posted: 08/01/2012 03:18 PM IST
Tapsi birthday today

       tapsi_ineeeeఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న సొట్టబుగ్గల చిన్నది తాప్సి. మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తోన్న ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు ఇవాళ (బుధవారం). 1987 ఆగస్టు 1 వ తేదీన ఢిల్లీ లో జన్మించిన తాప్సీ, చదువు పూర్తయ్యాక కొంత కాలం పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొనసాగింది. ఆ జాబ్ తన స్వభావానికి పనికిరాదని గ్రహించిన ఆమె, తనకి ఎంతో ఇష్టమైన సినిమా రంగంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మోడలింగ్ చేస్తోన్న ఆమెని 'ఝుమ్మంది నాదం' చిత్రం రూపంలో అవకాశం వరించింది. అలా తెలుగు తెరకి పరిచయమైన తాప్సీ, 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మొగుడు'  'దరువు' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో సైతం అవకాశాలను చేజిక్కించుకోగలిగింది. ప్రస్తుతం ఆమె 'గుండెల్లో గోదావరి', 'షాడో' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెకి ఆంధ్రావిశేష్.కాం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King nagarjuna appeal for fance
Rana tamil teramgetram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles