Chitra birthday today

chitra birthday today

chitra birthday today

35.gif

Posted: 07/27/2012 03:23 PM IST
Chitra birthday today

       1963 జులై  27న తిరువనంతపురంలో ఓ సంగీత కుటుంబంలో చిత్ర జన్మించారు. కేరళ విశ్వ విద్యాలయం నుంచి సంగీతంలో  పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన చిత్ర.. మళయాళ నేపథ్య గాయకుడు ఎం.జి.రాధాకృష్ణన్ ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. singer_innమేస్ట్రో ఇళయరాజా చిత్రను తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.ఇక అంతే ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఇళయారాజా, రెహమాన్ మొదలుకొని నేటి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఎన్నో పాటలను పాడారు. సంగీత రంగంలో చిత్ర  చేసిన సేవలకు భారత ప్రభుత్వం  పద్మశ్రీతో సత్కరించింది. ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9అవార్డులు, తమిళనాడు  ప్రభుత్వం నుంచి 4అవార్డులు, కర్ణాటక ప్రభుత్వం నుంచి 2అవార్డులు అందుకొన్నారు.
    దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా చిత్ర రికార్డు సృష్టించారు. చిత్ర ఎన్నో మంచి పాటలు పాడాలని మరెన్నో అవార్డులు  గెలుపొందాలని మనసారా కోరుకుంటూ దక్షిణాది సినీ గాన కోకిల చిత్రకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది ఆంధ్రావిశేష్.కాం..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitab bachhan at olympics
Ram charan bollywood movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles