Rajesh khanna house to be converted into museum

rajesh khanna, dimple khanna, daughters, twinkle khanna, rinki khanna,

Late superstar Rajesh Khanna's bungalow will reportedly be converted into a museum as per his daughters' wish

Rajesh Khanna house to be converted into museum.png

Posted: 07/21/2012 03:19 PM IST
Rajesh khanna house to be converted into museum

Kaka-House

బాలీవుడ్ లో తొలి తరం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా (కాకా) మొన్న బాంద్రాలోని తన సొంత ఇంట్లో  గత కొంత కాలంగా కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన సంగతి సినీ ప్రపచానికి తెలిసిందే. రాజేష్ కన్నా కన్ను మూసేముందు ఓ చిన్న కోరిక కోరుకున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. తాను మరణించాక తన ‘‘ఆశీర్వాద్ ’’బంగ్లాను మ్యూజియంగా మార్చాలని కోరుకున్నాడట. ఆయన చివరి కోరిక మేరకు ఆయన బంగ్లాని మ్యూజియంగా మార్చడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.

రాజేష్ ఖన్నా కూతుర్లు అయిన ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలదే తుది నిర్ణయం. వారి నిర్ణయం వెలువడిన వెంటనే ఆయన బంగ్లాని మ్యూజియంగా మార్చే ఏర్పాట్లు చేయనున్నారట. ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ని పెండ్లి చేసుకొంది కాబట్టి ఆమెకు ఆ ఇంటి తో పనిలేదు, ఇక రింకీ ఖన్నా లండన్ లో ఉంటుంది. కనుక ఆ ఇంటిలో వాళ్లెవరూ ఉండే పరిస్థితి లేని కారణంగా, ఆ బంగ్లాని మ్యూజియంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ఓ నటుడికి మ్యూజియం ఏర్పాటు చేయడమనేది అరుదైన రికార్డుగా మారనుంది. ఈ మ్యూజియంలో రాజేష్ ఖన్నా ధరించిన దుస్తులు ... ఉపయోగించిన వస్తువులు ... ఆయన ఇష్టపడి కొన్న కార్లు ... అందుకున్న జ్ఞాపికలు మొదలైనవి ఉంచే అవకాశాలు వున్నట్లు చెబుతున్నారు. ఒక వేళ మ్యూజియంగా మార్చితే మాత్రం ఆయన అభిమానులకు మాత్రం తను లేని లోటును కొంతైనా తీర్చినట్లు అవుతుందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun dance for chiru song
Geetha arts bags pawan cgr nizam rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles