Genelia tollywood future

genelia tollywood future

genelia tollywood future

1.gif

Posted: 07/15/2012 05:13 PM IST
Genelia tollywood future

       genelia_eటాలీవుడ్ నవ్వుల హాసిని జెనీలియా టాలీవుడ్ కు రాంరాం చెప్పేసిందా..? సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో కొన్నేళ్లపాటు ప్రేమయాణం సాగించి, పెళ్లాడిన తర్వాత టాలీవుడ్ ముఖం చూడటమే మానేసింది. హీరోయిన్ గా ఎదగడానికి టాలీవుడ్ జెనీలియాకు మంచి అవకాశాలు ఇచ్చింది. 'బొమ్మరిల్లు' సినిమా జెనీలియా కెరీర్ కు మంచి లైఫ్ ఇచ్చింది. ఆరెంజ్, నా ఇష్టం వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టి బాలీవుడ్ లోనే  సెటిలైపోయింది ఈ భామ. 'బొమ్మరిల్లు'కు రీమేక్ గా హిందీలో తెరకెక్కుతున్న ‘ఇట్స్ మై లైఫ్'లో జెనీలియా తన హాసిని పాత్రను పోసిస్తోంది. మరి కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ కమిటవుతోంది. జెనీలియా భర్త ఫ్యామిలీకి పొలిటికల్ టచ్ ఉంది. జెన్నీ మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ మాజీ ముఖ్యమంత్రి. అయితే ఈ భామ కూడా త్వరలోనే రాజకీయ రంభ అవ్వనుందనే ప్రచారం కూడా వినిపించింది. పెళ్ళయిన కొత్తలో ఈ విషయాన్ని జెనీలియాని అడిగితే- ‘‘రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నా ఇంటికోసం, నా వారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా వస్తాను. దానికి మావారి అభిప్రాయమే కాదు... మా మామగారి అంగీకారం కూడా అవసరం. నిజంగా అంకుల్‌కి నేను ప్రచారం చేస్తే మంచి జరుగుతుందనుకుంటే... ఆయన కోడలిగా ప్రచారానికి తప్పకుండా వెళతాను' అని చెప్పుకొచ్చింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  David bil movie in full swing says shobha
Silverstar stollen son mundered  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles