వెంకటేష్ తన రొటీన్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి, చేస్తున్న చిత్రంగా 'షాడో' సినిమాని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఫ్యామిలీ టైపు పాత్రలు పోషించే వెంకీ, ఇందులో డాన్ పాత్రలో నటిస్తున్నాడు. స్టయిలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే, వెంకటేష్ కెరీర్లో ఇంత బడ్జెట్ తో ఇంత వరకు ఏ చిత్రమూ రూపొందలేదు. ఈమూవీలో శ్రీకాంత్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. మెహర్ రమేష్ భారీ ఎత్తున రూపొందిస్తోన్న 'షాడో' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తాజా షెడ్యూలు షూటింగ్ మలేసియాలోని లాంగ్ క్వీ ఐలాండ్ లో ప్లాన్ చేశారు. ఇది చెప్పుకోదగిన టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఈ షెడ్యూల్ ని ఇక్కడ ప్లాన్ చేశారు. 20 రోజుల పాటు ఇక్కడ కొనసాగనున్న ఈ షెడ్యూలుకు 8 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు. ప్రధాన తారాగణానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ... నాయకా నాయికల మధ్య పాటలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసిన పోరాట సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం స్టార్ క్రూయిజ్ షిప్పులను ... హెలికాఫ్టర్లను అద్దెకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ అభిమానులకీ ... యాక్షన్ చిత్ర అభిమానులకు వెంకీ – మెహర్ రమేష్ లు కనువిందు చేస్తారేమో..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more