Film actor kota birthday today

film actor kota birthday today

film actor kota birthday today

7.gif

Posted: 07/10/2012 02:17 PM IST
Film actor kota birthday today

      kota_srinnivas_raoఇవాళ (మంగళవారం) సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూనే ఉన్నారు కోట. ఏ పాత్రలో నైనా అవలీలగా ఒదిగిపోయే కోట కు ఆంధ్రావిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ ఈ స్పెషల్ స్టోరీ...
      kota_fతెలుగు చలన చిత్ర రంగంలో విలనిజం కు మారు పేరుగా నిలిచిన విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు 1947 జూలై 10న విజయవాడలో జన్మించారు. చిన్న నాటి నుండి నాటకాలు అంటే ఆసక్తి ఉన్న ఈయన 1978లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన “ప్రాణం ఖరీదు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా బర్త్డే బాయ్ మాటలు మీకోసం..” ఒకప్పుడు సినిమా వ్యక్తులు అంటే సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలు ఉండేవి. కానీ ఇప్పుడు లేవు, ప్రస్తుతం సినిమా అనేది పూర్తి వ్యాపకంగా మారి సినిమా బజారున పడడంతో సినిమా వాళ్లైన మేము కూడా బజారునపడ్డాము. అప్పటికీ ఇప్పటికీ చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు దర్శకులు ఫిల్మ్ ని వృధా చేయకుండా ఎంతో అవగాహనతో తీసేవారు, కానీ ఇప్పుడు వస్తున్న కొంతమంది దర్శకులు పూర్తి అవగాహన లేక టేకుల మీద టేకులు తీస్తున్నారు, ఏమన్నా అడిగితే ఇది డిజిటల్ యుగం అంటున్నారు. ఇలాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడం వల్ల నిర్మాతలకు ఉపయోగం ఉండవచ్చు కానీ వాటి వల్ల మాలాంటి ఆర్టిస్టులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఒకే రకమైన పాత్రలు వస్తున్నపటికీ ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తాను, అందుకోసం ఇప్పటి రాజకీయ వేత్తలను స్పూర్తిగా తీసుకున్నాను. రోజూ టి.విలో వచ్చే వారి ప్రోగ్రామ్స్ చూసి వారి హావభావాలను అనుకరిస్తే చాలని” ఆయన అన్నారు.ko
    కాగా,  కోట శ్రీనివాస రావు ఇప్పటి వరకు సుమారు 700 పైగా చిత్రాల్లో నటించారు. ఈయన ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళంలో 25, కన్నడంలో 6 మరియు హిందీలో 6 చిత్రాల్లో నటించారు. ఈయన కెరీర్లో ఇప్పటివరకు 6 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు.
          నేడు తన పుట్టిన రోజు సందర్భంగా విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నటనకు నిలువెత్తు సాక్ష్యమైన కోట ఇలానే మరిన్ని చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా  ప్రేక్షకులను మెప్పు పొందాలని ఆంధ్రావిశేష్ ఆకాంక్ష.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan action with fance
Julayi movie post phoned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles