Rajini first item number for aamir khan

rajinikanth, aamir khan, item number, talaash, rajinikanth to do an item number in talaash, rajinikanths item number for aamir khan

It looks like superstar Rajinikanth is all set to join the item number bandwagon.

Rajini first item number for Aamir Khan.gif

Posted: 07/03/2012 04:40 PM IST
Rajini first item number for aamir khan

Aamir_Rajini

టాలీవుడ్ లో నైనా, బాలీవుడ్ లోనైనా ఐటెం సాంగ్ లేనిదే సినిమాలు ఉండటం లేదు. పాత కాలం సినిమాలలో ఆరు పాటలు, మూడు ఫైట్లు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకునేవారు దర్శకులు. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో ఓ ఐటెంసాంగు ఉండే విధంగా చూసుకుంటున్నారు. అవసరం లేకున్నా ఎక్కడో ఓచోట ఇరికించి దానికి మంచి మసాల దట్టిస్తున్నారు. ఈ ఐటెం సాంగుల కోసమైనా జనం ఎగ బడిసినిమాలు చూస్తున్నారు. ఈ ఐటెం సాంగుల బిజినెస్ మంచి వర్కౌవుట్ కావడంతో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఈ బిజినెస్ లోకి దిగారు. ఇప్పుడు ఆ కోవలోకి హీరోలు కూడా చేరబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఓ సినిమాలో ఐటెం సాంగు  చేయబోతున్నాడు. దానికి భారీగానే పారితోషికం కూడా తీసుకుంటున్నాడని టాక్. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'తలాష్' హిందీ చిత్రంలో రజనీ ఈ ఐటెం సాంగును చేయనున్నట్టు బాలీవుడ్ సమాచారం.

ఇందులో అమీర్, కరీనాకపూర్, రాణిముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీమా కాగ్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫరాన్ అక్తర్, రితేష్ సింధ్వానీ లతో కలిసి అమీర్ నిర్మిస్తున్నాడు. రజనీకి వున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఈ పాటను పెట్టాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం రజనీతో ఈ విషయమై సంప్రదిస్తున్నారు. ఇందుకు గాను ఆయనకు ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఒకవేళ రజనీ ఇందులో నటిస్తే కనుక, నిజంగా ఇదొక సంచలనమే అవుతుంది.  చిత్రానికి ఇది కచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఉత్తరాదితో బాటు దక్షిణాన కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసే అవకాశం వుంది. మరి రజినీ కాంత్ అమీర్ ఖాన్ సినిమా కదా అని నటించడానికి  ఒప్పుకున్నాడో లేక, కాసుల కోసం ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti pirates operation on to catch big fish
Naga chaitanya in nag majnu remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles