Stars cricket at vizag

stars cricket at vizag

stars cricket at vizag

19..gif

Posted: 06/29/2012 08:31 PM IST
Stars cricket at vizag

     సినీతారలు మళ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. జూలై 14న వైజాగ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో టాలీవుడ్ హీరోలు పాల్గొంటారు. 2e అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాలకు సహాయం అందించడం కోసం శ్రీవిజేత గ్రూప్స్ వారు సంయుక్తంగా తారల క్రికెట్ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ వివరాలను టాలీవుడ్ హీరోలు తెలిపారు. మొదట్లో హీరోలంతా సరదాగా గడపడం కోసం క్రికెట్ మ్యాచ్ లు ఆడటం మొదలుపెట్టామని, ఆ తర్వాత అది పలువురికి సహాయం చేయడం కోసం ఆడుతున్నామని హీరో శ్రీకాంత్ అన్నాడు. జూలై-14న వైజాగ్ లోని  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసిఏ-విడీసీఏ స్టేడియంలో ఒక 20-20 మ్యాచ్ అడబోతున్నామని శ్రీకాంత్ తెలిపాడు. ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుందని అన్నాడాయ. హీరో తరుణ్ మాట్లాడుతూ.. వైజాగ్లో ఒక మ్యాచ్ ఆడబోతున్నామని, అందులో ఒక టీంకి శ్రీకాంత్, మరో టీంకి తను కెప్టెన్ గా వ్యవహరించబోతున్నామని తెలిపాడు. క్రికెట్ మ్యాచ్ వివరాలను తెలిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజీవ్ కనకాల, ఆదర్శ్, సుదీర్ బాబు, రఘు, చరణ్ తేజ్.. తదితరులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gb antyakshari team
Al the best movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles